health tips: డయాబెటిస్ బాధితులకు అలెర్ట్: ప్రతీరోజూ రాత్రి ఈ జాగ్రత్తలతో డయాబెటిస్ కంట్రోల్!!
డయాబెటిస్.. దీర్ఘకాలిక వ్యాధి. డయాబెటిస్ ను సకాలంలో నియంత్రించకపోతే అది హార్ట్ స్ట్రోక్ ను, బ్రెయిన్ స్ట్రోక్ ను కూడా కలిగిస్తుంది. సరైన ఆహారం తీసుకుంటూ, జీవనశైలి విధానాన్ని మార్చుకుంటే డయాబెటిస్ ప్రభావాన్ని కొంతమేరకు తగ్గించవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాలి అనుకుంటే కచ్చితంగా తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్లను తగ్గించి, ప్రొటీన్లు పెంచుకోవాలి. మంచి ప్రోటీన్లు ఉన్న ఆహారాన్ని తీసుకుంటే డయాబెటిస్ కంట్రోల్ అవుతుంది.
డయాబెటిస్ ను అదుపులో ఉంచుకోవడానికి రాత్రిపూట కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిక్ బాధితులు రాత్రివేళ చిరుతిండ్లు తినకూడదు. డయాబెటిక్ బాధితులు రాత్రిపూట తక్కువ తినాలి. అది కూడా ఏడు గంటల లోపే డయాబెటిక్ బాధితులు భోజనం చేయడం మంచిదని సలహా ఇవ్వబడింది. రక్తంలో చక్కెర స్థాయిలు నిర్వహించడం కోసం డయాబెటిస్ బాధితులు ప్రతి రోజూ 7 నుండి 8 గంటల సేపు నిద్రపోవాలని సూచిస్తున్నారు.

ఇక ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక కప్పు చామంతి టీ తాగితే డయాబెటిస్ అదుపులోకి వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక నిద్రకు ముందు వాకింగ్ చేయడం కూడా డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుందని చెబుతున్నారు.
ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఏడు నుంచి ఎనిమిది పప్పులు నానబెట్టిన బాదం పప్పు తినడం వల్ల కూడా షుగర్ లెవెల్ అదుపులోకి వస్తుంది. అలాగే ప్రతిరోజు రాత్రి సమయంలో నానబెట్టిన మెంతుల నీళ్లు తాగుతూ, నానబెట్టిన మెంతులు తింటే కూడా డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. మెంతులు హైపో గ్లైసీమిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. అవి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
అలాగే రాత్రి భోజనం చేసిన తర్వాత మరియు పడుకునే ముందు 15 నిమిషాల పాటు వజ్రాసనంలో కూర్చుంటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ కంట్రోల్ అవుతాయి. తిన్న ఆహారం ఈజీగా జీర్ణమవుతుంది. అందుకే డయాబెటిస్ ను కంట్రోల్ చేసుకోవాలనుకునే వారు రాత్రివేళల్లో ఈ చిన్న చిన్న చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
మనం రోజూ తినే ఈ ఆహారాలలో ఆల్కాహాల్ ఉంటుంది.. మీకు తెలుసా! -
మళ్లీ మళ్లీ తినాలనిపించే "పీతల బిర్యానీ" ఎలా చేయాలంటే..? -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
పెద్దలనాటి 'చద్దన్నం'.. సమ్మర్ లో ఇలా టేస్టీగా.. -
చీకటి పడ్డాక ఎండ కావాలా? అయితే రూ. 5 లక్షలు కట్టాల్సిందే! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు












Click it and Unblock the Notifications