health tips: విపరీతమైన మెంటల్ టెన్షన్స్ ... తగ్గించుకోండిలా.. లేదంటే ప్రమాదం!!
చాలామంది నిత్యం రకరకాల టెన్షన్స్ తో ఇబ్బందులు పడుతుంటారు. విపరీతమైన తలనొప్పితో, విపరీతమైన ప్రెజర్స్ తో జీవితాన్ని దుర్భరంగా గడుపుతూ ఉంటారు. పని ఒత్తిడి, డబ్బు చిరాకులు, ఇంట్లో చిరాకులు ప్రతీ ఒక్కరికీ ఉండేవే అయినప్పటికీ కొందరు వాటిని మ్యానేజ్ చెయ్యలేరు. అటువంటివారు టెన్షన్ నుండి రిలీఫ్ అవ్వడం చాలా ముఖ్యమైన విషయమని చెబుతున్నారు వైద్యులు. మానసికంగా ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలుగుతాం అని చెబుతున్నారు.
ఎవరైనా మానసికంగా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారు తమకి తాము అనారోగ్యం నుండి బయటపడడానికి ప్రయత్నం చెయ్యటం మంచిది. అందుకు కొన్ని చిట్కాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెబుతున్నారు. మరి వాటి గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. మనసంతా చిరాకుగా ఉంటే ఒత్తిడి తగ్గించే ఎక్సర్సైజులు చేయడం మంచిదని, మసాజ్ చేసుకోవడం, వేడినీళ్లతో స్నానం చేయడం వంటివి చేస్తే కాస్త చిరాకు తగ్గుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కాస్త మానసికస్థితి మెరుగుపడుతుందని చెబుతున్నారు.

మీరు మీ ఆలోచనలను ఎప్పుడూ ఒక పేపర్ మీద రాసినప్పుడు మానసిక సమతుల్యత పాటించబడుతుంది అని, మనసులో ఉన్న చిరాకు కాస్త తగ్గుతుందని, రాయడం కూడా ప్రెషర్ రిలీజ్ చేసే ఒక మంచి చిట్కా అని చెబుతున్నారు. మనసు చిరాకుగా ఉన్నప్పుడు కాసేపు ప్రశాంతంగా ఒంటరిగా కూర్చునే ప్రయత్నం చేయాలి. మనసుకు ఇష్టమైన పనిని చేస్తూ ఆ టెన్షన్ నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి.
ఒక ప్రతిరోజు మంచి నిద్ర పోవడం కూడా మానసిక టెన్షన్ లను దూరం చేస్తుంది. ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటల నిద్ర మీ మెదడును తాజాగాను, మెంటల్ టెన్షన్ ల నుండి మిమ్మల్ని రిలాక్స్డ్ గాను ఉంచుతుంది. ఇక మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే ముందు జీవనశైలిని మార్చుకోవాలి.
ఆరోగ్యకరమైన జీవనశైలి మిమ్మల్ని మానసికంగా ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం, ఎప్పుడూ సానుకూల దృక్పథాన్ని కలిగి ఉండడం, కుటుంబ సభ్యులతో, స్నేహితులతోనూ సరదాగా గడపడం మానసికంగా ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఆరోగ్యమే మహా భాగ్యం .. మనసు బాగుంటేనే ఏ పనైనా జరిగేది అనేది గుర్తుంచుకుని మానసికంగా ప్రశాంతంగా ఉండండి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications