Health tips: ప్రతిరోజు ఎన్ని అడుగులు వేస్తే ఫిట్ గా ఉంటారు?

ప్రతి వ్యక్తి తనను తాను ఆరోగ్యంగాను, ఫిట్ గాను ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీని కోసం వారు వివిధ రకాల వ్యాయామాలు కూడా చేస్తారు. ప్రతిరోజు ఉరుకుల పరుగుల జీవితంలో, రకాల పనులతో అలసిపోయే వారు... అలసట లేకుండా ఉండడం కోసం, పనిచేయడం కోసం, ఆరోగ్యం కోసం రోజు నడవాలి అని చెబుతున్నారు వైద్యులు.

ఆరోగ్యంగా ఉండడానికి ప్రతిరోజు కఠినమైన దినచర్య పాటించనవసరం లేదు. ఎంత బిజీ షెడ్యూలు ఉన్నప్పటికీ కొంత సమయాన్ని మీ ఆరోగ్యం కోసం, ఫిట్నెస్ కోసం కేటాయిస్తే మంచిది. ప్రతిరోజు కేవలం ఒక గంట సేపు నడక మిమ్మల్ని ఫిట్ గాను, ఆరోగ్యంగాను ఉంచుతుంది. అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని కాపాడుతుంది అయితే ప్రతిరోజు ఎంతసేపు ఏ సమయంలో నడవడం శరీరానికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.

Health tips: How many steps to walk every day to stay fit?

నడకతో రోజును ప్రారంభిస్తే రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. పాజిటివ్ గా కూడా ఫీలవుతారు. ప్రతిరోజు ఉదయం వాకింగ్ చేయడం వల్ల మీ గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణవ్యవస్థకు సంబంధించిన అనేక సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుంది. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం, మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వాకింగ్ చేయడం ఎంతో మంచిది.

ఉదయం నడవడానికి సమయం దొరక్కపోతే సాయంత్రం ఒక అరగంట పాటు నడిస్తే మంచిది రోజుకు పదివేల అడుగులు నడవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. పదివేల అడుగుల నడక మనల్ని శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను ఉత్తేజంగా ఉంచుతుంది. ప్రతిరోజు నడవడం వల్ల మీ శరీరాన్ని మీరు కచ్చితంగా లైట్ గా ఫీల్ అవుతారు.

ప్రతీ రోజూ నడవటం వల్ల ఆరోగ్యం గాను, ఎనర్జిటిక్ గానూ ఫీలవుతారు. అయితే వాకింగ్ చేసే వాళ్ళు ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే వాకింగ్ చేసే వాళ్ళు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వాకింగ్ చెయ్యాలి. కొద్ది రోజులు వాకింగ్ చెయ్యటం, కొద్ది రోజులు మానెయ్యటం చెయ్యకూడదు. అలా చేస్తే ఏ విధమైన ఫలితం ఉండదు

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+