health tips: వేడినీళ్ళతో తలస్నానం చేస్తే జుట్టుకు మంచిదేనా?

మనిషి యొక్క అందాన్ని నిర్ధారించే వాటిలో జుట్టు చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా మహిళల విషయంలో జుట్టు వారి రూపురేఖలను నిర్ధారిస్తుంది. అటువంటి జుట్టు విషయంలో జాగ్రత్త తీసుకోవడం అవసరం. స్నానం చేసేటప్పుడు ఏ నీటితో స్నానం చేయాలి? జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి చన్నీళ్ల స్నానం మంచిదా? వేడి నీళ్ల స్నానం మంచిదా? వంటి వివరాలను తెలుసుకోవాలి.

చలికాలంలో ప్రజలు వేడినీళ్ళతో స్నానం చేస్తారు. వేసవికాలంలో చన్నీళ్ళతో స్నానం చేస్తారు. చలికాలంలో వేడినీళ్ళతో స్నానం చెయ్యటం వలన హాయిగా నిద్ర వస్తుంది. అది మంచిదే కానీ వేడినీళ్ళతో తలస్నానం చేయటం జుట్టుకు హాని కలిగిస్తుంది. అయితే గోరు వెచ్చని నీటిని తలపై పోసుకోవటం హానికరం కాదు అని చెప్తున్నారు. బాగా చల్లని, బాగా వేడి నీళ్ళను తల మీద పోసుకోవటం మంచిది కాదని అంటున్నారు.

health tips: Is showering with hot water good for hair?

ఒకవేళ వేడినీళ్ళను తలస్నానానికి ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు తెలుసుకుందాం. వేడినీళ్ళతో తల స్నానం చెయ్యటం వలన జుట్టు పొడిబారటం, వెంట్రుకలు చిట్లిపోవటం, వెంట్రుకలు నిర్జీవం కావటం మొదలవుతుంది. బాగా వేడి నీటితో తలస్నానం చేయటం వలన స్కాల్ప్ యొక్క రంధ్రాలు తెరుచుకుని, జుట్టు మూలాలలో బలహీనపడుతుంది. వేడినీళ్లలో జుట్టు కడుక్కోవడం వల్ల జుట్టులో ఉండే కెరాటిన్ ప్రోటీన్ కరిగిపోయి జుట్టు డ్యామేజ్ అవుతుంది.

బాగా వేడి నీళ్లతో జుట్టును కడగడం వల్ల స్కాల్ప్ మొత్తం ఎర్రగా మారుతుంది. తలపై చిరాకు, చుండ్రు పెరుగుతుంది. బాగా వేడి నీళ్లతో తలస్నానం చేయడం వల్ల జుట్టులోని తేమ తగ్గుతుంది. ఫలితంగా జుట్టు పొడిగా.. గరుకుగా, చిరాకుగా మారుతుంది. మనకు గుచ్చుకుంటున్నట్టు అనిపిస్తుంది.

జుట్టును నిరంతరం వేడి నీళ్లతో కడుక్కోవడం వల్ల కూడా స్కాల్ప్ లో పొడిదనం పెరుగుతుంది. దీని కారణంగా చుండ్రు - జుట్టు రాలడం సమస్య పెరుగుతుంది. అయితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వలన మాత్రం మంచి ప్రయోజనాలు ఉంటాయి. జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. జుట్టు ఊడదు. మరీ కాలిపోయి, మరిగిపోయే అంతగా వేడిని పొరబాటున కూడా జుట్టు మీద పోసుకోకూడదు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+