ఫ్రూట్ జ్యూస్ సోడా కంటే డేంజర్? వేసవిలో ఇవి తాగితే చావే!
సాధారణంగా మనకు ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే.. "ఏం తిన్నావు?" అని అడుగుతుంటారు. కానీ మనం ఏం తాగుతున్నామనేది కూడా అంతే ముఖ్యమని హెచ్చరిస్తున్నారు ప్రముఖ ఆయుర్దాయ నిపుణుడు (Longevity Expert) డాక్టర్ వాసిలీ ఎలియోపౌలోస్.
మనం రోజూ ఎంతో ఇష్టంగా తాగే కొన్ని పానీయాలు మన గుండెకు నిశ్శబ్దంగా హాని చేస్తున్నాయని, అవి రక్తంలో చక్కెరను పెంచడమే కాకుండా గుండెపోటుకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన సోషల్ మీడియా వేదికగా హెచ్చరించారు. మరీ ముఖ్యంగా వేసవిలో చల్లగా ఉండేందుకు మనం తీసుకునే ఈ డ్రింక్స్ మన పాలిట యమ పాశాలుగా అభివర్ణించారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి. అవి తాగితే మనం ఎందుకు ప్రమాదంలో పడతామో చుద్దాం.
1. ఫ్రూట్ జ్యూస్: ఫైబర్ లేని చక్కెర నీళ్లు!
మనం పండ్ల రసాలను చాలా ఆరోగ్యకరమైనవి అనుకుంటాం. కానీ పండును నేరుగా తినకుండా రసంగా తాగినప్పుడు అందులోని పీచు పదార్థం (Fiber) పోతుంది. డాక్టర్ వాస్ ప్రకారం, ఇది కేవలం 'లిక్విడ్ షుగర్'. ఇది సోడా కంటే వేగంగా రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల ప్యాంక్రియాస్‌పై ఒత్తిడి పెరిగి ఇన్సులిన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది, ఇది గుండెకు అస్సలు మంచిది కాదు.

2. తీపి కాఫీలు: ఉదయాన్నే తాగే డెజర్ట్!
కాఫీ తాగడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్న మాట వాస్తవమే. కానీ అందులో రకరకాల ఫ్లేవర్లు, చక్కెర కలిపితే అది కాఫీ కాదు, ఒక 'డెజర్ట్' (తీపి పదార్థం) లా మారిపోతుంది. ఒక పెద్ద కప్పు ఫ్లేవర్డ్ కాఫీలో దాదాపు 50 గ్రాముల చక్కెర ఉంటుంది. రోజూ ఉదయాన్నే ఇంత చక్కెరను శరీరానికి ఇవ్వడం అంటే గుండె జబ్బులను ఆహ్వానించడమే.
3. స్పోర్ట్స్ డ్రింక్స్: అథ్లెట్లకు తప్ప అందరికీ రిస్కే!
చాలామంది టీవీ యాడ్స్ చూసి స్పోర్ట్స్ డ్రింక్స్ తాగేస్తుంటారు. మీరు రోజుకు రెండు మూడు గంటలు కఠినమైన వ్యాయామం చేసే అథ్లెట్ అయితే తప్ప, మీకు ఈ డ్రింక్స్ అవసరం లేదు. వీటిలో ఉండే కార్బోహైడ్రేట్లు, కృత్రిమ రంగులు మెటబాలిక్ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వీటికి బదులు ఎలక్ట్రోలైట్స్ ఉన్న సాధారణ నీరు తాగడం ఉత్తమం.
4. ఆల్కహాల్: తక్కువ తాగినా తప్పదు!
మద్యం ఏ మోతాదులో తీసుకున్నా అది శరీరంలో మంటను (Inflammation) ప్రేరేపిస్తుంది. రక్తపోటు పెరగడానికి, నిద్ర సరిగ్గా పట్టకపోవడానికి ఇది ప్రధాన కారణం. గుండె ఆరోగ్యం బాగుండాలంటే నెలకు కేవలం రెండు డ్రింక్స్‌కే పరిమితం అవ్వాలని డాక్టర్ వాసిలీ సూచిస్తున్నారు.
5. డైట్ సోడా: పేరుకే డైట్.. పనులు మాత్రం డేంజర్!
చక్కెర లేదని డైట్ సోడాలు తాగే వారికి ఇదొక హెచ్చరిక. వీటిలోని కృత్రిమ స్వీటెనర్లు మన కడుపులోని మంచి బ్యాక్టీరియాను దెబ్బతీస్తాయి. ఇది ఇన్సులిన్ ప్రతిస్పందనను మార్చివేసి, దీర్ఘకాలంలో గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తుంది.
మనం తాగే ఈ పానీయాల ప్రభావం ఒక్క రోజులో కనిపించకపోవచ్చు. కానీ కొన్ని ఏళ్ల పాటు ఇవి శరీరంలో పేరుకుపోయి గుండెను బలహీనపరుస్తాయి. అందుకే రుచికరమైన పానీయాల కంటే.. స్వచ్ఛమైన నీటికే ప్రాధాన్యత ఇవ్వడం మీ గుండెకు మీరు ఇచ్చే గొప్ప బహుమతి!












Click it and Unblock the Notifications