పురుషుల్లో స్పెర్మ్ ఎలా తయారవుతుంది?
పురుషుల్లో స్పెర్మ్ ఎలా తయారవుతుంది? ఎలా నిల్వ ఉంటుంది? అనే ప్రశ్నలు తరుచుగా ఉత్పన్నమవుతుంటాయి. వృషణాల్లో ఈ ప్రక్రియ మొదలవుతుంది. ఇవి ఒక రకమైన కర్మాగారాల్లాంటివి. ఇక్కడే స్పెర్మ్ కణాలు తయారవుతాయి. వృషణాలలో లక్షలాది చిన్న నాళాలు ఉంటాయి. ఈ నాళాలలో స్పెర్మటోజెనిసిస్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియలో స్టెమ్ సెల్స్ అనే ప్రాథమిక కణాలు స్పెర్మ్ కణాలుగా పరిణమిస్తాయి. దీనికి అధిక సమయంతోపాటు దశలవారీగా జరుగుతుంటుంది.
ముడుచుకున్న నాళంలోకి ప్రవేశిస్తాయి
స్పెర్మ్ కణాలు పరిణమిస్తున్నప్పుడు, సెర్టోలి కణాలు అనే మరొక రకమైన కణాలు వాటికి పోషణ, రక్షణ కల్పిస్తాయి. తయారైన స్పెర్మ్ కణాలు వృషణాల నుంచి ఎపిడిడిమిస్ అనే ఒక సన్నని, ముడుచుకున్న నాళంలోకి ప్రవేశిస్తాయి. ఇక్కడ స్పెర్మ్ కణాలు పరిపక్వత చెంది చలనశీలతను పొందుతాయి. స్ఖలనం జరిగే సమయంలో, ఎపిడిడిమిస్ నుంచి స్పెర్మ్ కణాలు వాహక నాళాల ద్వారా బయటకు వెళ్తాయి. స్పెర్మ్ తయారవడానికి ఇప్పుడు చెప్పుకోబోయేవన్నీ కారణమవుతాయి. టెస్టోస్టెరోన్ అనే హార్మోన్ స్పెర్మ్ ఉత్పత్తికి చాలా ముఖ్యమైనది. ఆరోగ్యకరమైన ఆహారం స్పెర్మ్ నాణ్యతను మెరుగుపరుస్తుంది. వ్యాయామం, నిద్ర, తగినంత నీరు తాగడం వంటివి స్పెర్మ్ ఆరోగ్యానికి మంచివి. వయసు పెరిగే కొద్దీ స్పెర్మ్ నాణ్యత తగ్గవచ్చు. కొన్ని రోగాలు స్పెర్మ్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తాయి.

ఇది నిరంతర ప్రక్రియ
స్పెర్మ్ ఉత్పత్తి ఒక నిరంతర ప్రక్రియగా జరుగుతుంటుంది. ఈ కణాలు కంటికి కనిపించనంత చిన్నవి. స్పెర్మ్ కణాల జీవితకాలం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది.
స్పెర్మ్ కణాలు స్త్రీ గర్భాశయంలోకి ప్రవేశించిన అనంతరం అండంతో కలిసి గర్భధారణ జరుగుతుంది. పండ్లు, కూరగాయలు, గింజలు, చేపలు వంటి ఆహారాలు స్పెర్మ్ ఆరోగ్యానికి చాలా ముఖ్యం. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు స్పెర్మ్ కణాలను రక్షిస్తాయి. రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తికి చాలా ముఖ్యం. వృషణాల ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రత కంటే కొంచెం తక్కువగా ఉండాలి. కాబట్టి వేడినీటి స్నానం ఎప్పుడన్నా చేస్తుండాలికానీ తరుచుగా చేయకూడదు












Click it and Unblock the Notifications