వారానికి ఎంత బీరు తాగితే ఆరోగ్యానికి సురక్షితం?
బీరు, ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన పానీయం. కేవలం రుచి కోసం మాత్రమే కాకుండా, సరదాగాను, విశ్రాంతి కోసం కూడా చాలా మంది బీరును ఇష్టపడతారు. దీనిని తాగడం సరదాగా అనిపించినప్పటికీ, దీన్ని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. మితమైంది అంటే ఎంత అనే విషయం వ్యక్తిగత ఆరోగ్యం, జీవనశైలి, వ్యతిరేక పరిమాణాలను బట్టి మారుతుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఇతర ఆరోగ్య నిపుణుల ప్రకారం, మితమైన మద్యం సేవించడం ప్రతి రోజుకి లేదా వారానికి నిర్దిష్ట పరిమితిలో మాత్రమే చేయాలి.
వారానికి ఎంత బీరు తాగొచ్చు?
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మార్గదర్శకాలు: ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం, మహిళలు సుమారు 5శాతం ఆల్కహాల్‌తో రోజుకు 330 మిల్లీలీటర్ల బీర్ తాగాలని చెబుతోంది. అదే పురుషులు అయితే, 660 మిల్లీ లీటర్ల వరకు తాగొచ్చని అంటుంది. మహిళలు వారానికి 7-14 యూనిట్ల ఆల్కహాల్ కంటే తక్కువగా తాగడం సురక్షితంగా పరిగణించబడుతుంది. ఒక యూనిట్ అంటే సుమారుగా ఒక గ్లాస్ వైన్ లేదా ఒక బీర్ క్యాన్. పురుషులైతే వారానికి 14-21 యూనిట్ల ఆల్కహాల్ కంటే తక్కువగా తాగడం సురక్షితంగా పరిగణించబడుతుంది.

బీర్ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గుండె ఆరోగ్యం: తక్కువ మోతాదులో బీర్ తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని నిపుణులు వివరించారు. బీర్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. శరీరానికి కావాల్సిన ఫైబర్ కంటెంట్ బీర్లో 20శాతం ఉంటుంది. బీర్‌లో పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగాఉండి, కిడ్నీలో రాళ్లు కరిగించడానికిసహాయపడతాయి.
బీర్ తాగడం వల్ల కలిగే అనర్థాలు:
బరువు పెరుగుదల: బీర్ అధికంగా తాగితే బరువు త్వరగా పెరిగిపోతారు. దీనివల్ల ఊబకాయం బారిన పడతారు. రాత్రి సమయాల్లో నిద్ర పట్టదు. ఉదయానికి హ్యాంగోవర్ గా ఉంటుంది. రోజూ బీరు తాగటం వల్ల దీర్ఘకాలంలో నిద్రలేమి సమస్యతోపాటు కిడ్నీ, లివర్ డ్యామేజ్ అవుతుంది. బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. రోజూ బీరు తాగడం వల్ల కిడ్నీలపై ఎఫెక్ట్ పడుతుంది. ఈ కారణంగా కిడ్నీ స్టోన్ లేదా కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ప్రమాదం ఉంటుంది.
బీర్ తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఎక్కువ మోతాదులో తాగడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బీరు తాగే విషయంలో ముఖ్యంగా వయస్సు, బరువు: వయస్సు, బరువు, ఆరోగ్య స్థితి, జెండర్ ఇవన్నీ బీర్ తాగే లిమిట్‌ని నిర్ణయిస్తాయి. కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవారు బీర్ తాగడం మానుకోవాలి. కొన్ని ఔషధాలతో బీర్ తాగడం వల్ల దుష్ప్రభావాలు వచ్చే అవకాశం ఉంది. కనుక, బీర్ తాగే ముందు మీ వైద్యుని సలహా తీసుకోవడం మంచిది.
-
ఈ ఆకుతో ఒక్క రాత్రిలోనే మీ జుట్టు నల్లగా మారిపోతుంది -
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
సమ్మర్ స్పెషల్ "అరటిపండు ఆమ్లెట్" ఎలా చేయాలంటే ??? -
ఖాళీ కడుపుతో తేనే కలిపిన గోరువెచ్చని నీటిని తీసుకుంటే చాలు -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం












Click it and Unblock the Notifications