మగాళ్లు పైకిచెప్పలేని విషయాలేంటో తెలుసా?
ఆడవారికైనా, మగవారికైనా కోరికలు సహజంగానే ఉంటాయి. కొందరు పురుషులు తమలోని భావాలను, కోరికలను చెప్పుకోలేరు. వ్యక్తిత్వంలో, వ్యక్తిగత జీవితంలో పురుషుడి జీవితంలో అనేక పొరలుంటాయి. వాటికింద తమలోని భావోద్వేగాలను, కోరికలను తొక్కిపెట్టి ఉంచుతారు. స్త్రీలకు తెలియని విషయం ఏమిటంటే.. మగవారు కూడా రహస్యాలను దాస్తారని. ఈ విషయం దాదాపు 97 శాతం మహిళలకు తెలియదు. భార్యలకు చెప్పలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో చూద్దాం.
ఏదైనా సంఘటన చోటుచేసుకున్నప్పుడు తనకు మద్దతు కావాలని స్త్రీలు అడిగినట్లుగా పురుషులు అడగలేరు. కానీ వారికి కూడా ఆ అవసరం ఉంటుంది. కష్టసమయాల్లో మద్దతు ఆశిస్తారు. అంతేకాదు.. ఒత్తిడి నుంచి బయటపడేయాలని కోరుకుంటారు. అయితే ఈ విషయాలను వారు నోరు తెరిచి అడగలేరు. జీవిత భాగస్వామికి కూడా ఈ విషయాన్ని చెప్పలేరు. భయంగా ఉందని, బాధపడుతున్నామని ఎవరికైనా తెలిస్తే చులకనైపోతామనే భయం వారిని వెన్నాడుతుంది. దగ్గరి వ్యక్తులు, స్నేహితులు, బంధువులు, ప్రియమైనవారు, కుటుంబ సభ్యులను కోల్పోయినప్పుడు ఆ బాధను వారిలోనే దిగమింగుకుంటారుకానీ పైకి చెప్పలేరు.

స్త్రీలా చిన్న చిన్న విషయాలను పట్టించుకోరు. బంధువుల మధ్య జరిగిన చిన్న చిన్నవాటిని కూడా పట్టించుకోరు. దీనివల్ల వారి సంబంధాలను అలాగే ఉంచుతుంది. మరికొన్ని సార్లు మాత్రం పెద్ద గొడవలకు దారితీస్తాయి. అంతే.. మగవారు చెప్పరు.. బాగా సన్నిహితులైతే తప్ప. ఏదేమైనప్పటికీ మగవారు కొన్ని విషయాల్లో కఠినంగానే ఉంటారు.












Click it and Unblock the Notifications