బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలంటే వీటి జోలికి వెళ్లొద్దు!

ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారం ముఖ్యంగా మనం ఉపయోగిస్తున్న నూనెలు మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతున్నాయి. ఇక చాలామంది కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలని అనుకుంటారు కానీ దాని కోసం ఏం తినాలి? ఏం తినకూడదు అనే విషయాలపైన శ్రద్ధ పెట్టరు. చెడు కొలెస్ట్రాల్ మన శరీర ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం వల్ల డయాబెటిస్, బిపి వంటి ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి.

చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే ఈ ఆహారాలు తినొద్దు
ఇక చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలి అనుకునేవారు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. కొన్ని ఆహార పదార్థాల జోలికి అస్సలు వెళ్ళకూడదు. ఇక ఆ ఆహార పదార్థాలు ఏమిటి అంటే.. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్న వారు ప్రాసెస్ చేసిన ఆహారాలను తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉండే సోడియం, సంతృప్త కొవ్వులు, కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతాయి.

If you want to reduce bad cholesterol avoid these food items

రెడ్ మీట్, డీప్ ఫ్రై ఆహారాలు మంచిది కాదు

నూనెలో వేయించినటువంటి ఆహారపదార్థాలను తినకూడదు. నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉండటం వల్ల ఇవి కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతుంది . ఇక రెడ్ మీట్ ను కూడా తినడం మంచిది కాదు. బీఫ్, పోర్క్, మటన్ లాంటి రెడ్ మీట్లో సంతృప్తకొవ్వు ఎక్కువగా ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ ను బాగా పెంచుతాయి. ఇవి తినకుండా ఉంటేనే మంచిది.

ఇవి తింటే చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది
వెన్న, చీజ్, క్రీమ్ వీటిలో కొవ్వు, సోడియం ఎక్కువగా ఉంటాయి. వీటిని కూడా తినకుండా ఉంటేనే మంచిది . ఇక చక్కెర ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. కేక్, కుకీస్ వంటి బేక్ చేసిన ఆహారాలలో ఉప్పు, క్యాలరీలు, కొవ్వు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఇవి కూడా కొలెస్ట్రాల్ పెరగడానికి కారణమవుతాయి. జంక్ ఫుడ్ తినడం ఏమాత్రం మంచిది కాదు.

ఇవి అసలే తినొద్దు
బయట తయారు చేసే ఫ్రైడ్ రైస్ లు, నూడిల్స్, పాస్తా వంటివి తినడం కూడా మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. బయట హోటల్స్ లో తయారు చేసే బిర్యాని లను కూడా తినడం చెడు కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణమవుతుంది.

ఈ ఆహారాలకు దూరంగా ఉండండి
ఇక చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలని భావించేవారు ఈ ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది. ఈ ఆహారాల వల్ల మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. కనుక చెడు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి అనుకుంటే పైన పేర్కొన్న ఆహారాలకు దూరంగా ఉంటే మంచిది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+