సంతానలేమి.. పురుషులలో వీర్యకణాల తగ్గుదలకు కారణాలివే.. జాగ్రత్త!!

ప్రస్తుత సమాజంలో సంతానలేమి అతిపెద్ద సమస్యగా మారింది. సంతానలేమితో ప్రతి సంవత్సరం లక్షలాది మంది ఫెర్టిలిటీ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. ప్రస్తుత సమాజంలో ఆహారపు అలవాట్లు, సరైన జీవన శైలి లేకపోవడం కారణంగా చాలామంది పురుషులలో సంతాన ఉత్పత్తి సమస్య వస్తుంది. దీనికి ప్రధాన కారణం కావలసినంత స్పెర్ము కంటే లేకపోవడం.

పురుషులలో తక్కువ వీర్యకణాల ఉత్పత్తి కారణాలివే
పురుషులలో తక్కువ వీర్యకణాల ఉత్పత్తి వెనుక అనేక కారణాలు ఉన్నాయి . పురుషులలో వీర్యకణాలు తక్కువగా ఉండడం ఒక్కొక్కసారి జన్యుపరమైన కారణాల వల్ల కూడా సంభవిస్తుంది. అంతేకాదు పురుషులలో స్పెర్ము కౌంట్ డయాబెటిస్ కారణంగా తగ్గుతుంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నప్పటికీ వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. కరోనరీ ఆర్టరీ వ్యాధి కారణంగా కూడా స్పెర్ము కౌంట్ తగ్గుతుంది.

Infertility These Reasons for decrease in sperm count in men

ఈ కారనాలతోనూ స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది
పురుషులలో ప్రైవేట్ భాగాలలో గాయాలైతే, లేదా ఏదైనా ఇతర సెక్సువల్ వ్యాధులు వస్తే, వెన్నుపూసకు గాయమైతే, శస్త్ర చికిత్సలు జరిగితే వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది. పురుషులలో క్యాన్సర్ వస్తే కూడా వీర్య కణాల సంఖ్య తగ్గే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ చికిత్సలో భాగంగా ఇచ్చే కీమోథెరపీ మరియు శస్త్ర చికిత్స కారణంగా వీర్య కణాల సంఖ్య తగ్గుతుంది.

హార్మోన్ల అసమతుల్యత కూడా కారణం
కొన్నిసార్లు మన శరీరంలో ఉన్నటువంటి హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా వీర్య కణాల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఎక్కువగా ధూమపానం చేసే వారిలో, ఆల్కహాల్ అధికంగా తీసుకునే వారిలో, వీర్య కణాల నాణ్యత తగ్గడంతో పాటు అనేక ఇతర చెడు ప్రభావాలు కూడా కలిగిస్తుంది. అంతేకాదు తక్కువ వీర్యకణాల సంఖ్య తో అనేక ఇతర సమస్యలు కూడా లింక్ అయ్యి ఉన్నాయి.

నిద్ర, టెన్షన్.. ఇలా ఎన్నో కారణాలు
వీటిలో నిద్రకు సంబంధించిన సమస్యలు, శారీరక వ్యాయామం లేకపోవడం, వయసు మీద పడడం, ఒత్తిడి, కలుషిత వాతావరణం వంటి సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉంటేనే వీర్యకణాల సంఖ్య కూడా ఆరోగ్యంగా ఉంటుంది అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తించాలి. పురుషులలో వీర్యకణాల సంఖ్య తగ్గితే సంతానలేమి సమస్యలు ఉత్పన్నమవుతాయనేది తెలుసుకుని జీవనశైలి ఆరోగ్యంగా ఉంచుకోవాలి .

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+