బ్రేక్‌ఫాస్ట్ లో ఇడ్లీలు తినటం మంచిదేనా?
చాలామంది అల్పాహారంలో ఇడ్లీలు తినడం మంచిదని చెబుతారు. కొంతమంది ఇడ్లీలు తినడం మంచిది కాదని ఇడ్లీలతో బరువు పెరుగుతారని చెబుతారు. అసలు ఇడ్లీలు తినడం మంచిదేనా? ఇడ్లీలు తింటే ఏమొస్తుంది? వంటి వివరాలు ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ప్రతిరోజు మనం తప్పనిసరిగా బ్రేక్ఫాస్ట్ చేయాలి. ఇక బ్రేక్ ఫాస్ట్ ను రిచ్ గా చేయాలని చెబుతారు. అల్పాహారాన్ని మహారాజులా తింటేనే బలంగా ఉంటామని కూడా చెబుతారు.
ఇడ్లీల గురించి తెలుసుకోండి
అయితే అటువంటి అల్పాహారంలో ఇడ్లీ తినొచ్చా? ఇడ్లీ తింటే ఆరోగ్యానికి మేలు కలుగుతుందా అంటే .. అవును ఇడ్లీలు తినొచ్చు.. ఇడ్లీలు తింటే ఆరోగ్యానికి మేలు జరుగుతుంది అని చెబుతోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఇడ్లీని ఒక ఆరోగ్యకర ఆహారంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పరిగణించింది. ఇడ్లీ చాలా సులభంగా జీర్ణం అవ్వడం వల్ల ఇది మంచి అల్పాహారంగా చెప్పొచ్చు.

ఇడ్లీలతో ఆరోగ్యం
ఇందులో క్యాలరీలు తక్కువ ఉంటాయని, ఇడ్లీ తయారు చేయడానికి నూనె వాడకం ఉండదు కాబట్టి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదం లేదని కూడా చెప్పొచ్చు. ఇడ్లీని మినప్పప్పును నానబెట్టి పిండి రుబ్బి ఇడ్లీ రవ్వ కలిపి పులియబెట్టి చేస్తారు. కాబట్టి ఇడ్లీలను తింటే పేగు ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతారు. ఇడ్లీల కోసం మినప్పప్పును వాడడం వల్ల మినప్పప్పు లో ఉండే పోషకాలు మన శరీరానికి శక్తినిస్తాయని చెప్పొచ్చు.
మినప్పప్పుతోనే కాదు మిల్లెట్స్ ఇడ్లీలు .. ఆరోగ్యం
మినప్పప్పు లో ఐరన్, పీచు, పోషకాలు పుష్కలంగా ఉంటాయని చెబుతున్నారు. ఇక బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇడ్లీ తినడం చాలాసేపు పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగిస్తుందని చెబుతున్నారు. మామూలు ఇడ్లీలే కాకుండా ప్రస్తుతం మిల్లెట్స్ తో తయారు చేస్తున్న ఇడ్లీలను, రాగి ఇడ్లీలను కూడా తింటే మరింత ఆరోగ్యం మెరుగుపడుతుందని చెబుతున్నారు.
వీళ్ళు ఇడ్లీలు తినాలంటే లిమిట్ మర్చిపోవద్దు
బ్రేక్ ఫాస్ట్ బాగా రిచ్ గా చేయాలని చెబుతారని, ఇష్టం వచ్చినన్ని ఇడ్లీలు తింటే మాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఊబకాయంతో బాధపడేవారు, డయాబెటిస్ బాధితులు ఇడ్లీలు తిన్నప్పటికీ రెండు మూడు ఇడ్లీలను మాత్రమే తినాలని ఇష్టం వచ్చినట్టు ఇడ్లీలను లాగిస్తే అనవసరంగా ఇబ్బంది పడతారని హెచ్చరిస్తున్నారు.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications