కుక్కలను ముద్దు పెట్టుకుంటున్నారా..? అయితే జరిగేది ఇదే..!

మనిషికి జంతువులతో ఉన్న అనుబంధం ప్రత్యేకమైనది. ముఖ్యంగా పెంపుడు కుక్కలు (పెట్ డాగ్స్) మన కుటుంబంలో ఒక సభ్యుడిలా కలిసిపోతాయి. వాటిని ముద్దు పెట్టుకోవడం, కౌగిలించుకోవడం చాలామందికి అలవాటు. కానీ ఈ అనుబంధంలో ఒక ప్రమాదం దాగి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువులను ముద్దు పెట్టుకోవడం వల్ల మనుషులకు వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.

జూనోటిక్ ట్రాన్స్‌మిషన్:
నెదర్లాండ్స్‌కు చెందిన పరిశోధకుల అధ్యయనం ప్రకారం, సుమారు 50% మంది పెంపుడు జంతువుల యజమానులు వాటిని ముద్దు పెట్టుకోవడం వల్ల సాల్మొనెల్లా బ్యాక్టీరియా వంటి హానికరమైన సూక్ష్మక్రిములకు గురవుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం, కుక్కలు, పిల్లులు మరియు ఇతర పెంపుడు జంతువుల నోటిలోని లాలాజలంలో హానికరమైన బ్యాక్టీరియా, వైరస్‌లు మరియు పరాన్నజీవులు ఉంటాయి. ఈ విధంగా జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించడాన్ని జూనోటిక్ ట్రాన్స్‌మిషన్ అంటారు.

Is Kissing Your Pet Dangerous Expert Warnings on Zoonotic Diseases

ఏయే వ్యాధులు రావచ్చు?
చాలామంది పెంపుడు జంతువుల నోరు పరిశుభ్రంగా ఉంటుందని భావిస్తారు, కానీ అది నిజం కాదు. వాటి నోటిలో సాల్మొనెల్లా, పాస్ట్యూరెల్లా, బార్టోనెల్లా వంటి బ్యాక్టీరియాలు ఉండవచ్చు. ఇవి మనుషులలో జీర్ణ సంబంధిత సమస్యలు, ఇన్ఫెక్షన్లు మరియు ఇతర తీవ్రమైన అనారోగ్యాలను కలిగించవచ్చు.ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, చిన్న పిల్లలు, వృద్ధులు, మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతారు.

నిపుణుల సలహా
పెంపుడు జంతువులతో ప్రేమ, అనుబంధం మంచిదే అయినప్పటికీ, వాటితో మరీ సన్నిహితంగా ఉండటం, ముఖ్యంగా ముద్దు పెట్టుకోవడం వంటి అలవాట్లు మానుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వాటితో ఆడుకున్న తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వాటిని క్రమం తప్పకుండా పశువైద్యుడి వద్ద పరీక్షించించడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ప్రేమ, ఆరోగ్యం రెండూ ముఖ్యమే కాబట్టి, తగిన జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+