పాలు విరక్కుండా బెల్లం టీ.. ఇలా చేస్తే సూపర్ టేస్ట్..!
చాలా మందికి టీ పేరు చెబితే చాలు ఎక్కడ లేని హూషారూ, ఉత్సాహం వస్తాయి. టీ అంటే ఓ ఎమోషన్ అని భావిస్తుంటారు. కొందరికి కప్పు టీ కడుపులో పడందే రోజు మొదలవ్వదు. ఇక ఛాయ్ ప్రేమికుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఏదో ఒక టైమ్ లో తేనీటి పానీయాన్ని తాగడానికి ఇష్టపడతారు. అయితే ఇటీవలి కాలంలో చక్కెరతో చేసిన టీ కంటే బెల్లంతో చేసిన టీని తాగేందుకు ఇష్టపడుతున్నారు. మరి ఈ టేస్టీ బెల్లం టీ ఎలా తయారు చేసుకోవాలి..? పాలు విరిగిపోకుండా బెల్లం టీ ఎలా తయారు చేయాలి..?
అయితే పాలు విరక్కుండా బెల్లం టీ తయారు చేసుకునే విధానం చూస్తే.. ముందుగా ఒక గిన్నెలో ఒక కప్పు నీటిని తీసుకోవాలి. అందులో అల్లం, యాలకులు వేసి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో టీ పొడి వేసి 2 లేదా 3 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. బెల్లం తురుము వేసి అది కరిగే వరకూ కలపాలి. ఇప్పుడు విడిగా వేడి చేసిన పాలను ఇందులో పోసి, చిక్కటి టీను వడకట్టుకోవాలి. ఇలా చేస్తే మీ టీ రుచిగా.. చిక్కగా కూడా ఉంటుంది..

అయితే బెల్లం టీ విరక్కుండా ఉండాలంటే.. బెల్లం వేసిన తర్వాత పాలను నేరుగా మరిగించకూడదు. వేడి పాలు లేదా కాచిన పాలను చివరగా కలపడం ఉత్తమం. ఇక బెల్లం శ్వాసకోశంలోని శ్లేష్మాన్ని తొలగించి.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే బెల్లంలో కార్బోహైడ్రేట్లు, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ఐరన్ తదితర పోషకాలు అనేకం ఉంటాయి. ఇవి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications