Jamun Benefits: నేరేడు పండ్లు తినడం లేదా.. అయితే మీరు నష్టపోతారు..!
తినడానికి అంత రుచిగా ఉండని పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో నేరేడు పండు. దీన్ని అల్ల నేరవళ్లు అని కూడా అంటారు. ఈ పండ్లు వేసవిలో విరిగా లభిస్తాయి. అయితే ఇవి తింటే కాస్త వగరుగా అనిపించినా.. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.నేరేడు పండ్లలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక్క నేరేడు పండులో 1.41 మిల్లీగ్రాముల ఐరన్ ఉంటుంది. అలాగే 15 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది.
ఈ పండులో సి విటమిన్ కూడా అధికంగా ఉంటుంది. నేరేడు పండు లో ప్రొటీన్లు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మాంగనీస్, విటమిన్ సి మరియు బి6 పుష్కలంగా ఎక్కువగా ఉంటాయి. ఇది హిమోగ్లోబిన్ పెంచడానికి ఉపయోగపడుతుంది. నేరేడు పండ్లు తినడం వల్ల రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. జీర్ణప్రక్రియను వేగవంతం చేసే లక్షణాలను నేరేడు పండులో ఉన్నాయి.

మధుమేహంతో బాధపడే వారికి నేరేడు పండ్లు చక్కని ఔషధంగా పని చేస్తాయి. అధిక మూత్రం, అధిక దాహం లక్షణాలను ఇవి తగ్గిస్తాయి. నేరేడు పండులో ఉండే ఫైటో కెమికల్స్ గుండె ఆరోగ్యానికి దోహదపడుతుంది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నేరేడు పండు తింటే జలుబు, దగ్గు లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్ నుంచి త్వరగా కోలుకోవచ్చట.
డయాబెటిక్ రోగులు ఈ పండ్లను ప్రతిరోజూ తీసుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది. నేరేడులోని అధిక ఆల్కలాయిడ్ కంటెంట్ హైపర్‌గ్లైసీమియా లేదా అధిక రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థవంతంగా నియంత్రిస్తుందట. నేరేడు పండ్లతో పాటు, విత్తనాలు, ఆకులు, బెరడు చాలా ఉపయోగపడతాయి. నేరేడు పండ్లు ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచుతాయట. పై తొక్క తినేసి అందులోని విత్తనాలు ఊసేస్తారు. కానీ పండు మాత్రమే కాదు అందులోని విత్తనాలతో చేసిన పౌడర్ కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications