వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

health tips: కోడిగుడ్డుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలిస్తే రోజూ గుటుక్కుమనిపించేస్తారు!!

|
Google Oneindia TeluguNews

మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి శక్తిని ఇచ్చే ఎన్నో పోషక విలువలు ఉంటాయి. అయితే ఆహార పదార్థాలలో ఎటువంటి పోషక విలువలు ఉంటాయి? అవి మన శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయి? అనే విషయాలను మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తీసుకునే ఆహారంలో కోడిగుడ్డును ఒక భాగం చేసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వైద్యులు చెబుతున్నారు. పౌష్టికాహార లోపం అధిగమించాలి అనుకునేవారికి వైద్యులు సూచించే పదార్థాలలో ముఖ్యమైనది కోడిగుడ్డు. ప్రతిరోజు కోడి గుడ్డు తినడం వల్ల పౌష్టికాహార లోపం అధిగమించవచ్చని చెబుతున్నారు వైద్యులు. నిత్యం ఉడికించిన కోడిగుడ్డు తినడం ఎంతో మంచిది అని సూచిస్తున్నారు.

health tips: ఏ వయసు వాళ్లైనా యంగ్ గా కనిపించాలంటే హెల్త్ మంత్ర ఇదే!!health tips: ఏ వయసు వాళ్లైనా యంగ్ గా కనిపించాలంటే హెల్త్ మంత్ర ఇదే!!

 ఉడికించిన కోడి గుడ్డు తింటే అనేక ప్రయోజనాలు

ఉడికించిన కోడి గుడ్డు తింటే అనేక ప్రయోజనాలు

ఉడికించిన కోడిగుడ్లలోపొటాషియం, విటమిన్ ఇ, ఐరన్, జింక్ పుష్కలంగా ఉంటుందని,గుడ్డులో మాంసకృత్తులు,ప్రొటీన్లు సమృద్ధిగా ఉంటాయని అవి ఆరోగ్యవంతంగా ఎదిగేందుకు దోహదపడతాయని చెప్తున్నారు. కండరాలను బలోపేతం చేయడమే కాకుండా శరీరానికి అవసరమైన శక్తిని కూడా ఇస్తాయి అని చెబుతున్నారు.కోడిగుడ్లు అనునిత్యం తినడం వల్ల కంటి చూపు మెరుగు గా ఉంటుందని, విటమిన్-డి లోపాన్ని అధిగమించడానికి కోడుగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

అనేక రోగాలకు టానిక్ లాగా పనిచేసే కోడిగుడ్డు

అనేక రోగాలకు టానిక్ లాగా పనిచేసే కోడిగుడ్డు


అంతేకాదు శారీరక బలహీనత ఉన్నవారికి, క్షయ వ్యాధి గ్రస్తులకు, గర్భిణులకు, పాలిచ్చే బాలింతలకు, కాలేయ వ్యాధులు ఉన్నవారికి కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని, గుడ్డులోని తెల్లసొనను ఒక కప్పు పాలలో కలిపి రెండు చెంచాల తేనె కలిపి తీసుకుంటే అది వారికి టానిక్ లాగా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు. ఉడికించిన గుడ్డులోని పచ్చసొనతో ఒక చెంచాడు తేనె కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుండి త్వరగా కోలుకుంటారని చెబుతున్నారు.ఇక నరాల బలహీనతకు కూడా కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని,ఉడికించిన కోడి గుడ్డులోని పచ్చసొన,చెంచాడు తేనెతో కలిపి,రెండు బాదం పప్పులను వేసి ప్రతిరోజూ రాత్రివేళల్లో పడుకోబోయే ముందు తీసుకుంటే నరాల బలహీనత తగ్గుతుందని చెబుతున్నారు.

ముఖారవిందానికి, జుట్టు కోసం ఉపయోగపడే కోడిగుడ్డు

ముఖారవిందానికి, జుట్టు కోసం ఉపయోగపడే కోడిగుడ్డు


అంతేకాదు జుట్టు రాలే సమస్యను నివారించడానికి కూడా కోడిగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్న పరిస్థితి ఉంది. గుడ్డులోని తెల్లసొనను తల మీద రాసుకుని సున్నితంగా మర్దనా చేసుకుని, ఆపై గోరువెచ్చని నీటితో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందని చెబుతున్నారు. ముఖం మీద ఏర్పడిన మచ్చలు,మొటిమలు పోవాలంటే ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఒక చెంచాడు తెల్లసొన, చెంచాడు మీగడ, రెండు చుక్కల నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలని, తరువాత మర్దనా చేసుకుని ఉదయం గోరువెచ్చని నీటితో కడుక్కుంటే ముఖం సున్నితంగా మారుతుందని అంటున్నారు.

కోడిగుడ్డు పచ్చసొన పై అపోహలు.. తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కోడిగుడ్డు పచ్చసొన పై అపోహలు.. తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


నాడీ సమస్యలు ఉన్నవారికి, గర్భిణీలకు క్యాల్షియం అందించడానికి కోడుగుడ్డు ఎంతగానో ఉపయోగపడుతుంది అంటున్నారు. ప్రతి రోజు గుడ్డు తినడం ద్వారా మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని, హెచ్ డి ఎల్ స్థాయి పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ట్రైగ్లిజరైడ్ల మోతాదును తగ్గించటం ద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేందుకు నిత్యం కోడి గుడ్డు తినడం మంచిదని సూచిస్తున్నారు. గుడ్డులో ఉండే పచ్చసొనతో కొవ్వు పెరుగుతుందని చాలా మంది భావిస్తూ ఉంటారు. కానీ అది గుండెకు మంచి చేసే కొవ్వు అని నిరభ్యంతరంగా పచ్చసొన కూడా తినవచ్చని వైద్యులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ప్రతి రోజు కోడి గుడ్డు తినడం వల్ల మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతున్నాయని వైద్యులు చెబుతున్న క్రమంలో మరి ఇంకెందుకు ఆలస్యం రోజుకో గుడ్డును గుటుక్కుమనిపించండి.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

English summary
Eggs have many health benefits. Eating eggs regularly can prevent many diseases. Muscle and nerve weakness decreases. Heart health improves. Egg is very useful for skin beauty and hair.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X