తీపి తింటే తంటాలెన్నో తెలుసా...?
తీపి తినడం కూడా చాలామందికి ఇప్పడు ఒక వ్యసనంలా మారింది. కొందరు స్వీట్లు కనపడగానే తినకుండా ఆగలేరు. కానీ అధికంగా తీపి తింటే ఆరోగ్యానికి ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీపి పదార్థాలు ఎంత ఎక్కువగా తింటూ ఉంటే అంతగా తినాలనిపిస్తాయి. బాగా తీపిని తినాలినిపిస్తుంది అంటే దానికి అడిక్ట్ అయినట్టే.. తీపి రుచిని నాలుక మీది రుచికణాలు అడాప్ట్ చేసుకుని మళ్లీ మళ్లీ తినాలింపిచేలా చేస్తాయి. తీపి తీసుకోవడం పెరిగే కొద్దీ రుచికణాలు దానికి అలవాటుపడి మరింత తీపిని పెంచితే కానీ, రుచిని తెలుసుకోలేని స్థాయికి చేరుకుంటాయి.
మానసిక స్థితి సమస్యలు : ఎక్కువ మొత్తంలో తీపిని తీసుకున్నప్పుడు హార్మనల్ స్పందనతో శరీరం ఉత్తేజితమవుతుంది. తరువాత అది డౌన్ అయిపోతుంది. దాంతో మళ్లీ తిపిని తినాలనే కోరిక కలుగుతుంది. రక్తంలో షుగర్ స్థాయిలో హెచ్చుతగ్గులు వచ్చి శరీరంలో శక్తిలో కూడా హెచ్చుతగ్గులు వస్తాయి. అలాగే మనోస్థితిలో కూడా తేడాలు వస్తాయి. దాంతో మానసిక స్థితి స్థిమితంగా ఉండదు. మూడ్‌స్వింగ్స్ ఉంటాయి. స్వీట్లు ఎక్కువగా తింటున్నామంటే అర్థం శరీరానికి అవసరమైన ప్రోటీన్లు, పీచుని తగినంత తీసుకోవటం లేదని కూడా, తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకోవటం వలన కొంతమందిలో చర్మంమీద మొటిమలు, ర్యాషెస్ వంటి సమస్యలు కూడా వస్తాయి.

తీపి ఎక్కువగా తిన్నప్పుడు శరీరంలోని పాంక్రియాస్ ఎక్కువ ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయాలి. ఇది రక్తంలోని గ్లూకోజ్‌ని వివిధ అవయాలకు చేరుస్తుంది. అప్పుడు అది శక్తిగా మారుతుంది. అందుకే ఎక్కువ తీపిని తిన్నప్పుడు ఇన్సులిన్ మరింత ఎక్కువగా ఉత్పత్తి కావాలి. ఈ దశలో శరీరం సాధారణ స్థాయిలో ఉన్న ఇన్సులిన్‌కి స్పందించడం మానేస్తుంది. దాంతో శరీరం రక్తంలోని గ్లూకోజ్‌ని వినియోగించుకోవడం సక్రమంగా జరుగదు.
మధుమేహానికి దారితీస్తుంది : షుగర్‌తో కూడిన ఎక్కువ కేలరీలున్న ఆహారం తినటం వలన, ఇన్సులిన్ సరిగ్గా వినియోగించుకోలేని స్థితిలో శరీరం బరువు పెరుగుతుంది. ఇలా పాంక్రియాస్ ఎక్కువకాలం ఎక్కువగా ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేయాల్సి వస్తే అది మధుమేహానికి దారితీస్తుంది. లో బ్లడ్ షుగర్ ఉన్నవారు ఒక్కసారిగా తీపి పదార్థాలు ఎక్కువగా తింటే ఆ తేడా వలన మెదడు మందకొడిగా మారుతుంది. ఇక ఎక్కువ తీపి పదార్థాలతో నోటి బ్యాక్టీరియా పెరిగిపోయి పళ్లు వేగంగా దెబ్బతింటాయి.












Click it and Unblock the Notifications