కొబ్బరి పచ్చడి ఇలా చేస్తే అన్నంలోకే కాదు టిఫిన్స్ లోనూ అదుర్స్!
మనం తినే ఆహారంలో మనకు కావాల్సిన పోషకాలు ఉండేలా చూసుకోవాలి. అటువంటి పోషకాలతో ఉండే ఆహారాన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈరోజు మనం కొబ్బరిపచ్చడి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. కొబ్బరిపచ్చడితో మన శరీరానికి కావలసిన పోషకాలు అందడం మాత్రమే కాదు అనేక ఆరోగ్యప్రయోజనాలు కలుగుతాయి. అటువంటి కొబ్బరి పచ్చడిని ఈ విధంగా తయారు చేస్తే అన్నంలోకి మాత్రమే కాదు టిఫిన్స్ లోకి బాగుంటుంది.
కొబ్బరి పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
పచ్చిమిరపకాయలు- 8
ఎండు మిరపకాయలు- 2
ఉప్పు - తగినంత
జీలకర్ర - ఒక స్పూను
వెల్లుల్లి రెబ్బలు - 4
చింతపండు - ఉసిరికాయంత
కరివేపాకు- రెండు రెమ్మలు
నూనె- మూడు స్పూన్లు
పోపు గింజలు - ఒక స్పూను

తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు స్పూన్ల నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయలు, ఎండు మిరపకాయలు, చింతపండు వేసి ముక్కలను బాగా ఫ్రై చేయాలి. ఆ తర్వాత ఈ మొత్తం మిశ్రమాన్ని మిక్సీ జార్లో కానీ, రోట్లో కాని వేసి తగినంత ఉప్పు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా రుబ్బుకోవాలి.
కొబ్బరి పచ్చడిని అన్నంలో కానీ, టిఫిన్స్ లో కానీ బెస్ట్
గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మెత్తని పేస్ట్ గా మిక్సీ చేసుకోవాలి. స్టవ్ పై చిన్న పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నూనె వేసి నూనె వేడి అయిన తర్వాత పోపు గింజలు, కొద్దిగా కరివేపాకు వేసి పోపు రెడీ చేసి తయారు చేసుకున్న కొబ్బరి పచ్చడిలో కలుపుకుంటే కొబ్బరిపచ్చడి రెడీ అయినట్టే. ఇక ఈ కొబ్బరి పచ్చడిని అన్నంలో కానీ, టిఫిన్స్ లో కానీ తింటే బాగుంటుంది.
కొబ్బరి పచ్చడితో మన శరీరానికి మంచి ఎనర్జీ
కొబ్బరి పచ్చడితో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. కొబ్బరి పచ్చడితో మన శరీరానికి మంచి ఎనర్జీ వస్తుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది. దీనితో మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది. కొబ్బరి పచ్చడి కారణంగా చర్మానికి, జుట్టుకి ఇది మేలు చేస్తుంది.












Click it and Unblock the Notifications