పరగడుపునే నిమ్మరసం నీళ్లు తాగుతున్నారా?

చాలామంది ఉదయం లేవగానే పరగడుపునే నిమ్మరసం నీళ్లు తాగుతుంటారు. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడంతోపాటు యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, కాల్షియం, పొటాషియం, ఫోలేట్ వంటి పోషకాలుంటాయి.

* ఉదయం పూట నిమ్మరసం నీళ్లు తాగితే శరీరంలోని వ్యర్థాలను, టాక్సిన్స్ ను తొలగిస్తాయి.
* గ్యాస్ట్రిక్ జ్యూస్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి మెరుగైన జీర్ణక్రియను ప్రోత్సహిస్తుంది.
* నిమ్మకాయలతోపాటు ఇతర సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
ఇన్ఫెక్షన్ల నుంచి విటమిన్ సి శరీరాన్ని రక్షిస్తుంది.

Many people drink lemon water immediately upon waking up in the morning.

* శరీరంలో హార్మోన్ల ఉత్పత్తిని, ఐరన్ శోషణ, కొల్లాజెన్ సంశ్లేషణ లో ఉపయోగపడుతుంది.
* ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉండటానికి రోజంతా హైడ్రేట్‌గా ఉండాలంటే ప్రతి రోజూ తగినంత నీరు తాగాలి.
* నిమ్మకాయలో ఉండే పెక్టిన్ ఫైబర్ తినాలి అనే కోరికలను తగ్గిస్తుంది.. దీనివల్ల సులువుగా బరువు తగ్గుతారు.
* నిమ్మరసం నీరు ఆకలిని అణచివేస్తుంది. డిటాక్స్ వాటర్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.

* నిమ్మరసం నీళ్లు మూత్రపిండాల్లో రాళ్లను కరిగిస్తుంది. కిడ్నీలో ఖనిజాలు చేరడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడతాయి. కాల్షియం ఆక్సలేట్ తో ఏర్పడే వీటికి * సిట్రేట్‌ను దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది.
* శరీరం pH స్థాయిలను సమతుల్యం చేయడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు తోడ్పడుతుంది.

* నిమ్మరసంలో ఉండే సహజ యాంటీ బాక్టీరియల్ లక్షణాలు శ్వాసను తాజాగా చేయడానికి, బ్యాక్టీరియా వల్ల వచ్చే నోటి దుర్వాసనను అరికడతాయి.
* నిమ్మరసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఫ్రీ రాడికల్స్ ఏర్పాటును అడ్డుకుంటాయి. దీనివల్ల హృదయ సంబంధ వ్యాధుల ముప్పు తగ్గుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+