తక్కువ టైమ్ లో బరువు తగ్గడానికి 'ది బెస్ట్ సలాడ్' ఇదే..
ఊబకాయం సమస్య.. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తోంది. మారుతున్న జీవనశైలి కారణంగా ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. మనదేశంలోనూ లక్షల మంది అధిక బరువుతో ఇబ్బందులు పడుతున్నారు. గతంలో 40, 50 ఏళ్ల వయసు వారికి ఊబకాయం వచ్చేది. కానీ ఇప్పుడు పదేళ్లలోపు పిల్లల్లోనూ ఊబకాయం సమస్య కనిపిస్తోంది. దీనికి కారణం ఆహార నియంత్రణ లేకపోవడమేనని నిపుణులు అంటున్నారు. ఇక అధిక బరువును తగ్గించుకునేందుకు జిమ్ ల వెంట పరిగెత్తుతున్నారు నేటి యువత.
అయితే ఎలాంటి జిమ్ లు లేకుండా ఇంట్లోనే ఎంచక్కా ఒకే ఒక్క సలాడ్ లో తక్కువ టైమ్ లో స్పీడుగా ఎలా బరువు తగ్గచ్చో వైద్యులు చెబుతున్నారు. ఈ సలాడ్ ను రోజూ తాగితే వేగంగా బరువు నియంత్రణలోకి వస్తుందని వివరిస్తున్నారు. మరి ఈ సలాడ్ ఎలా తయారు చేసుకోవాలి.. ఈ సలాడ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఇక్కడ చూద్దాం.. ముందుగా సలాడ్ కు కావాల్సిన పదార్థాలు.. పుదీనా ఆకులు, కీరా ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, స్వీట్ కార్న్ ముక్కలు, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, అవిసె గింజల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి , తేనే కొంచెం, కొత్తిమీర, నిమ్మరసం, బీట్ రూట్ ముక్కలు, అలాగే రాత్రి నుంచి ఉదయం వరకు నాన బెట్టిన బార్లీ గింజలు.. సిద్దం చేసుకోవాలి..

ఇక సలాడ్ తయారీ విధానం ఓసారి చూస్తే.. ముందుగా బౌల్ లో పుదీనా ఆకులు, కీరా దోసకాయ ముక్కలు, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, స్వీట్ కార్న్, టమాటో ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. అందులో అవిసె గింజల పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నిమ్మరసం, తేనే వేసుకుని పూర్తిగా మిక్సింగ్ అయ్యేట్లు కలుపుకోవాలి. ఆ మిశ్రమంలో రాత్రి నుంచి ఉదయం వరకు నాన బెట్టిన బార్లీ గింజలు వేయాలి. ఆ పైన కొత్తిమీర చల్లుకుని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications