సూపర్ టేస్టీ 'మామిడి పానకం'.. ఇలా ఈజీగా చేసుకోండి..!
సమ్మర్ వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ స్టార్ట్ అవుతుంది. వేసవిలో మామిడి పండ్లు కొనేందుకు జనాలు ఎగబడుతుంటారు. మామిడితో జ్యూస్ అయినా పచ్చడి అయినా ఆ టేస్టే వేరుగా ఉంటుంది. అయితే మామిడిపండ్ల జ్యూస్ తాగి బోర్ కొట్టిందా..? అయితే సూపర్ టేస్టీ మామిడి పానకం ఇలా చేసుకోండి.. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లోనే ఈజీగా ఈ పానకాన్ని సింపుల్ గా తయారు చేసుకోవచ్చు. మరి ఈ టేస్టీ మామిడి పానకం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఎలా తయారు చేసుకోవాలి..? ఇక్కడ చూద్దాం..
సూపర్ టేస్టీ 'మామిడి పానకం' తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. పచ్చి మామిడి ఒకటి ముక్కలుగా కట్ చేసుకోవాలి, నీళ్లు మూడు కప్పులు, బెల్లం తురుము అర కప్పు, ఉప్పు చిటికెడు, మిరియాల పొడి పావు టీ స్పూన్, యాలకుల పొడి చిటికెడు, ఐస్ క్యూబ్స్ ఐదు నుంచి ఆరు తీసుకోవాలి.

ఇప్పుడు మామిడి పానకం తయారీ విధానం చూస్తే.. ముందుగా పచ్చి మామిడి ముక్కలను ఉడికించుకోవాలి. ఆ తర్వాత చల్లారనివ్వాలి. ఇప్పుడు ఉడికించుకున్న మామిడి ముక్కలను మెత్తగా ముద్దలా చేసుకోవాలి. బెల్లం నీటిలో కరిగించి మామిడి ముద్దలో కలపాలి. ఇప్పుడు అందులోనే ఉప్పు, మిరియాల పొడి, యాలకుల పొడి వేసి మిక్సింగ్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో నీళ్లు పోసి పల్చగా చేసి బాగా కలుపుకోవాలి. ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా ఉండగానే సర్వ్ చేసుకుంటే చాలు.. సూపర్ టేస్టీ మామిడి పానకం రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications