మినప గారెలు, కొచ్చరి చట్నీ కలిపి తింటున్నారా?

వింటే భారతం వినాలి.. తింటే గారెలు తినాలి అనేది తెలుగు భాష ఆవిర్భవించినప్పటి నుంచి ఉన్న సామెత. మహాభారతం ఎంత బాగుంటుందో తినడానికి మినపగారెలు కూడా అంతే బాగుంటాయి. వాటి రుచి వేరు. మహా కవులు, రచయితలెందరో తమ భార్యలను మినప గారెలు చేసిపెట్టమని వేడుకున్నవారే. అంతటి మహానుభావులే ఆ గారెలకు దాసులయ్యారు. వీటిని కొబ్బరి పచ్చడితో కలిపి తింటే మరింత రుచికరంగా ఉంటుంది. వీటితోపాటు పుదీనా పచ్చడి, నారింజ పచ్చడి కూడా గారెలకు బాగా సరిపోతుంది.

మినప గారెల ఆరోగ్య ప్రయోజనాలు
మినప పప్పును బాగా నానబెట్టిన తర్వాత మెత్తగా రుబ్బాలి. బాండీలో వీటిని వేయడానికి ముందు పిండితో కొంచెం ఉప్పు, కారప్పొడి కలపాలి. నూనెలో బంగారు రంగు వచ్చే వరకు వేయాలి. మినప పప్పు ప్రోటీన్‌కు మంచి మూలం. ప్రోటీన్ శరీరానికి బలం ఇచ్చి కండరాల నిర్మాణానికి సహాయపడుతుంది. అంతేకాదు.. జీవక్రియను మెరుగుపరుస్తుంది. గారెలు ఫైబర్‌తో ఉండటంవల్ల మలబద్ధకాన్ని నివారిస్తాయి. బరువును నియంత్రణలో ఉంచుకోవచ్చు. మినప పప్పులో విటమిన్లు, ఖనిజాలు, ఇనుము పుష్కలంగా ఉంటాయి. రక్తహీనతను నివారించడానికి ఇనుము సహాయపడుతుంది.

minapa garelu health benefits and uses in telugu

గుండె ఆరోగ్యంగా ఉంటుంది
మినప పప్పులోని ఫైబర్, ఇతర పోషకాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. పప్పులోని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రించడానికి తోడ్పడుతుంది. వీటిల్లో రకరకాల గారెలు కూడా ఉన్నాయి. సాధారణంగా మనం ఇంట్లో వేసుకునే గారెలు కాకుండా ఉల్లిపాయ మినప గారెలు, పచ్చిమిరపకాయ గారెలు, కరివేపాకు గారెలు.. ఇలా రకరకాల గారెలు ఉంటాయి. తినడానికి గారెలు మాత్రం ఆరోగ్యకరమైన ఎంపిక అవడమే కాకుండా మన ఆహారంలో ఒక భాగం చేసుకుంటే ఎంతో ఆరోగ్యవంతంగా ఉండొచ్చని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ప్రతిరోజు కనీసం రెండు గారెలు తినండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+