నిద్ర లేవగానే ఫోన్ చూస్తున్నారా..?
నేటి యువతరం మొబైల్ ఫోన్ కు బానిసగా మారింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే దాకా చేతిలో స్మార్ట్ ఫోన్ ఉండాల్సిందే. ఇది పక్కన లేకపోతే నిమిషం కూడా ఉండలేనట్టుగా ప్రవర్తిస్తుంటారు ఇప్పటి యువత. అయితే చాలామందికి నిద్ర లేవగానే ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది. యూట్యూబ్ రీల్స్, అలారం ఆఫ్ చేయడానికి, నోటిఫికేషన్స్ చూసుకోవడానికి, మెసేజ్ లు చెక్ చేసుకోవడానికి పొద్దున్నే ఫోన్ వాడుతుంటారు. అయితే ఉదయమే ఫోన్ ను వినియోగించడం కారణంగా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని చెబుతున్నారు వైద్యులు. జీవనశైలి కూడా దెబ్బతింటుందని అభిప్రాయపడుతున్నారు.
తాజా అధ్యయనం ప్రకారం.. ఉదయాన్నే ఫోన్ ఉపయోగించడం వల్ల ఇది మన మానసిక స్థితి పైన ఎంతో ప్రభావం చూపుతుందని అధ్యాయంలో తేలిందని వైద్యులు చెబుతున్నారు. చాలామంది ఉదయం లేవగానే ఫోన్ లో వాట్సప్ మెసేజ్ లు, సోషల్ మీడియా స్టోరీలు, రీల్స్, ఈమెయిల్స్ అంటూ చెక్ చేసుకుంటూ ఉంటారు. దీని కారణంగా ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉందని వివరిస్తున్నారు.

అలాగే మొబైల్ ఫోన్ నుంచి వచ్చే బ్లూ లైట్ ఇటు పిల్లల పైనా, అటు పెద్దల పైనా ప్రతికూల ప్రభావం చూపుతుందని వైద్యులు పేర్కొన్నారు. అలా కాకుండా ఉదయం లేవగానే ఫోన్ వినియోగం బదులు ఇష్టమైన వారితో కాసేపు టైమ్ స్పెండ్ చేయమని నిపుణులు చెబుతున్నారు. ఉదయాన్నే మొబైల్ చెక్ చేస్తూ లేని సమస్యల్ని కొని తెచ్చుకునే కంటే దీనికి దూరంగా ఉండడమే మేలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అలాగే ఫోన్ వినియోగం కాకుండా వ్యాయామం, ధ్యానం, వాకింగ్ వాటిపై దృష్టి పెట్టాలని అంటున్నారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications