బెస్ట్ హెల్త్ డ్రింక్.. మునగాకు సూప్.. ఇలా సింపుల్ గా చేసుకోండి..

మునగాకుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. మునగాకు రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను కూడా కంట్రోల్ చేయడంలో చాలా బాగా పని చేస్తుంది. అంతే కాక. ఇందులో క్యాల్షియం సహా మరి కొన్ని మినరల్స్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా అవుతాయి. అలాగే మునగాకులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువే. అందుకే.. రోజూ మునగాకును ఏదో విధంగా తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు. మరి మునగాకు సూప్ ఎప్పుడైనా ట్రై చేశారా..? ఈ మునగాకు సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..?

మునగాకు సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. మునగాకు ఒక కప్పు తరిగినవి, ఉల్లిపాయ ఒకటి, వెల్లుల్లి రెబ్బలు రెండు, అల్లం ఒక చిన్న ముక్క, టమోటా ఒకటి, నూనె లేదా నెయ్యి ఒక టేబుల్ స్పూన్, మిరియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్, ఉప్పు సరిపడా, నీళ్లు తగినన్ని, అలాగే కొత్తిమీర లేదా లెమన్ జ్యూస్ తీసుకోవాలి.

మునగాకు సూప్ తయారీ విధానం చూస్తే.. మునగాకును తీసుకుని వేడి నీటిలో బాగా మరిగించాలి. తర్వాత ఓ గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, వెల్లుల్లి, అల్లం వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కలను వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మునగాకు వేసి బాగా కలపాలి. ఆ తర్వాత ఆ మిశ్రమానికి నీళ్లు జోడించి 10-15 నిమిషాలపాటు ఉడికించుకోవాలి.

munagakusoup Your Daily Super Health Drink Made Super Simple in home made style healthy recipe

ఇప్పుడు అందులో ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలపాలి. అంతే సూపర్ టేస్టీ మునగాకు సూప్ రెడీ అయినట్టే.. ఇందులో కావాలంటే కొద్దిగా కొత్తిమీర లేదా లెమన్ జ్యూస్ వేసి సర్వ్ చేసుకుంటే సరి.. అయితే ఈ సూప్‌ ను వేడివేడిగా ఉన్నప్పుడు తాగితే అద్భుతంగా ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+