వెజ్ లవర్స్ కోసం "పుట్టగొడుగుల మసాలా కర్రీ"..!

పుట్టగొడుగుల కూర.. మన అమ్మమ్మల కాలం నుంచి వస్తున్న సంప్రదాయ వంటకం. ఇంట్లో పెద్దవాళ్లు కూడా ఈ కూర వండుతున్నప్పుడు, అది పూర్తిగా ఉడకక ముందే పిల్లలు ప్లేట్లతో సిద్ధంగా కూర్చుని ఎంతో ఆతృతగా ఎదురుచూసేవారని చెప్పుకుంటారు. ముఖ్యంగా వర్షాకాలంలో పుట్టగొడుగులు సమృద్ధిగా దొరికే సమయంలో.. ఈ కూర ఇంటిల్లిపాదీకి పండగలాంటి ఫీల్ తీసుకొస్తుంది. సరిగ్గా వండితే చికెన్ లేదా మటన్ కూరలకు ఏమాత్రం తీసిపోదు.

రుచికరమైన పుట్టగొడుగుల మసాలా కూర ఒక్కసారి తింటే చాలు... మాంసాహార ప్రియులను సైతం ఇట్టే ఆకట్టుకుంటుంది. వేళ్లు నాకేంత కమ్మదనంతో ఉండే ఈ కూర.. అన్నం, రోటీ, చపాతీ ఇలా దేనితో అయినా మంచి కాంబినేషన్ లాగా ఉంటుంది. అంతే కాకుండా పుట్టగొడుగుల్లో ఉండే బీటా గ్లూకాన్లు హృదయ సంబంధ సమస్యలను తగ్గిస్తాయి. కొన్ని రకాల మష్రూమ్‌లు క్యాన్సర్ కణాల పెరుగుదలను నిరోధించే సహజ సమ్మేళనాలను కలిగి ఉండటం విశేషం. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించి మధుమేహ నియంత్రణలో కూడా సహాయపడతాయి. అందుకే టేస్టీ టేస్టీ పుట్టగొడుగుల మసాలా కర్రీ ఎలా చేయాలో మీకోసం ప్రత్యేకంగా..

mushroom-masala-curry-making-recipe-in-telugu

కావాల్సిన పదార్థాలు..

  • పుట్టగొడుగులు - 200 గ్రాములు
  • ఉల్లిపాయలు - 2 (సన్నగా తరిగినవి)
  • టమాటో - 1 (మధ్యస్థాయి)
  • నూనె - 2-3 టేబుల్ స్పూన్లు
  • ఉప్పు - రుచికి సరిపడా
  • పసుపు - చిటికెడు
  • కారం - రుచికి తగినంత
  • పచ్చిమిర్చి - 2 (చీల్చినవి)
  • జీలకర్ర - 1 టీస్పూన్
  • ధనియాల పొడి - 1 టీస్పూన్
  • జీలకర్ర పొడి - అర టీస్పూన్
  • అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
  • యాలకులు - 2
  • దాల్చినచెక్క - 2 చిన్న ముక్కలు
  • లవంగాలు - 4
  • జీడిపప్పు - 2 టేబుల్ స్పూన్లు
  • పెరుగు - 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చి కొబ్బరి - పావు ముక్క
  • కరివేపాకు - 2 రెమ్మలు
  • కొత్తిమీర - గార్నిష్‌కు

మసాలా పేస్ట్ తయారీ విధానం..

ముందుగా మిక్సీ జార్‌లో అర అంగుళం దాల్చినచెక్క, రెండు యాలకులు, నాలుగు లవంగాలు, రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు, పావు ముక్క పచ్చి కొబ్బరి, రెండు టేబుల్ స్పూన్ల పెరుగు, ఒక టమాటో ముక్కలను వేసి, కొద్దిగా నీరు జోడించి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ కూరకు ప్రత్యేకమైన రిచ్ టేస్ట్ ఇస్తుంది.

గ్రేవీ తయారీ విధానం..

  • స్టవ్‌పై పాన్ పెట్టి, అందులో 2-3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడెక్కాక లవంగాలు, దాల్చినచెక్క ముక్కలు, యాలకులు, జీలకర్ర వేసి దోరగా వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలను వేసి, బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి.
  • ఉల్లిపాయలు రంగు మారగానే అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చివాసన పోయేవరకు వేయించాలి. ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ను వేసి, మంటను మధ్యస్థంగా ఉంచి బాగా కలపాలి. నూనె పైకి తేలే వరకు ఓపికగా వేయించాలి.
  • ఇప్పుడు ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా కలపాలి. అనంతరం కట్ చేసిన పుట్టగొడుగులను వేసి, మూడు నిమిషాలు మెల్లగా వేయించాలి. తర్వాత చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకును వేసి కలపాలి.
  • గ్రేవీ చిక్కదనాన్ని బట్టి అర కప్పు లేదా ముప్పావు కప్పు నీళ్లు పోసి, ఉప్పు సరిచూసుకోవాలి. మూత పెట్టి మంట తగ్గించి, ఐదు నుంచి పది నిమిషాల వరకు ఉడికించాలి.
  • గ్రేవీ చిక్కగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీరతో గార్నిష్ చేయాలి.

ఈ కర్రీని వేడి వేడి అన్నంతో చపాతీ, రోటీ, నాన్‌తో, జీరా రైస్ లేదా బటర్ రైస్‌తో సర్వ్ చేస్తే అదిరిపోయే కాంబినేషన్‌గా ఉంటుంది. పుట్టగొడుగుల మసాలా గ్రేవీ కూర రుచిలోనూ, వాసనలోనూ మాంసాహార కూరలకు దీటుగా నిలుస్తుంది. ఇంట్లో సులభంగా దొరికే పదార్థాలతో, తక్కువ సమయంలో తయారయ్యే ఈ వంటకం కుటుంబమంతా ఇష్టపడేలా ఉంటుంది. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేస్తే, మళ్లీ మళ్లీ చేయాలనిపించడం ఖాయమని చెప్పవచ్చు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+