సంక్రాంతి స్పెషల్ నువ్వుల ఉండలు ఎలా చెయ్యాలంటే

సంక్రాంతికి అందరూ పిండి వంటలు తయారు చేసుకుంటూ బిజీగా ఉన్నారు. అయితే సంక్రాంతికి పిండివంటలు చేసుకోవడం మంచిదే కానీ మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పిండివంటలు చేసుకోవాలి. అటువంటి వాటిల్లో నువ్వుల ఉండలు ఒకటి. ఈరోజు మనం నువ్వు ఉండాలి ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

నువ్వుల ఉండలు తయారీ విధానం
కావలసిన పదార్థాలు:
తెల్ల నువ్వులు - 1 కప్పు
బెల్లం - ¾ కప్పు
ఏలకుల పొడి - ½ టీస్పూన్
నెయ్యి - కొద్దిగా (చేతులకు రాయడానికి)

nuvvula laddu Recipe and Health Benefits

తయారీ విధానం:
ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టి నువ్వులను పొడి పాన్‌లో సిమ్ లో సువాసన వచ్చే వరకు వేయించాలి.వేయించిన నువ్వులను చల్లారనివ్వాలి. మరో పాన్‌లో బెల్లం వేసి కొద్దిగా నీరు పోసి పాకం వచ్చేలా కరిగించాలి. ఈ బెల్లం పాకంలో వేయించుకున్న నువ్వులను వేసి బాగా కలపాలి. ఇందులో యాలకుల పొడి కూడా వేసి కలపాలి. మిశ్రమం కొద్దిగా గట్టిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి.

నువ్వు ఉండల ఉపయోగాలు
ఆ తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్నచిన్న ఉండలుగా నువ్వుల ఉండలను చేయాలి. ఈ నువ్వుల ఉండలతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. క్యాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలకు మరియు దంతాలకు బలం చేకూరుతుంది. నువ్వులు జీర్ణశక్తిని మెరుగుపరిచే మలబద్ధకాన్ని నివారిస్తాయి. నువ్వుల్లో ఉండే మంచి కొవ్వులు కొలెస్ట్రాల్ ను నియంత్రించి హృదయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

చర్మానికి, జుట్టుకు ఆరోగ్యం
నువ్వుల ఉండలలో మనం బెల్లం ఉపయోగించడం వల్ల బెల్లం లో ఉండే ఐరన్ మన రక్తహీనతను తగ్గిస్తుంది. నువ్వులలో యాంటీ ఆక్సిడెంట్లు చర్మకాంతిని పెంచి మన జుట్టు బలంగా ఉండేలా చేస్తాయి. శరీరానికి వేడి అందించే గుణం నువ్వులలో ఉండడం వల్ల శీతాకాలంలో ఈ నువ్వుల ఉండలని తినడం చాలా మంచిది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+