ఇది రాయండి.. జుట్టు ఊడిపోకుండా దృఢంగా అవుతుంది
ఈరోజుల్లో వయసుతో సంబంధం లేకుండా జట్టు ఊడిపోతుంటుంది. ప్రతి ఒక్కరికీ రోజుకు కొన్ని వెంట్రుకాలు రాలిపోవడం సహజంగా జరుగుతుంటుంది. అలా కాకుండా ఎక్కువగా ఊడిపోతుంటే మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోక తప్పదు. ఉల్లిపాయ రసం జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. జుట్టు ఊడిపోకుండా నివారించేందుకు ప్రసిద్ధమైన ఔషధంలా పనిచేస్తుంది. తలలో ఉండే చుండ్రును కూడా నివారిస్తుంది. ఉల్లిపాయ రసం వాడటంవల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొన్ని దశాబ్దాలుగా దీన్ని ఉపయోగిస్తున్నారు.
జుట్టు ఎదుగుదల బాగుంటుంది
ఉల్లిపాయ నుంచి ఎక్కువగా వాసన వస్తుంది కాబట్టి చాలామంది ఉపయోగించరు. జుట్టు సంరక్షణ కోసం ఉల్లిపాయ రసాన్ని పట్టించేందుకు సరైన మార్గాన్ని తెలుసుకుందాం. 3 టీస్పూన్ల ఉల్లిపాయ రసంతో 2 టీస్పూన్ల నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని జుట్టు, తలకు వీలైనంత సమానంగా పట్టించాలి. అరగంట సమయం గడిచిన తర్వాత జుట్టును కడగాలి. ఇలా జుట్టుకు పట్టించడంవల్ల రాలడం ఆగిపోయి ఎదుగుదల కూడా బాగా వస్తుంది. వెంట్రుకలు కొంతమందిలో అకాలంగా నెరసిపోతుంటాయి. ఉల్లిపాయ రసం దీన్ని నివారిస్తుంది. ఉల్లిపాయలలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ.. యాంటీమైక్రోబయల్ లక్షణాలు జుట్టు పెరగడానికి ఉపయోగపడతాయని పరిశోధకులు కనుగొన్నారు.

ఖాళీ కడుపుతో తీసుకోవాలి
అంతేకాదు ఉల్లిపాయ రసాన్ని తాగడంవల్ల కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పొద్దున్నే ఖాళీ కడుపుతో తాడితే కిడ్నీలో రాళ్లు, నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఉల్లిపాయ రసంతో ఆవనూనెను కలిపి మసాజ్ చేస్తే కీళ్ల నొప్పి తగ్గుతుంది.












Click it and Unblock the Notifications