తాటిబెల్లం ప్రయోజనాలు తెలిస్తే వదిలిపెట్టరు

పంచదారకు ప్రత్యామ్నాయంగా పోషక విలువలు పుష్కలంగా ఉండే తాటిబెల్లాన్ని వాడొచ్చని ఆహార నిపుణులు చెబుతున్నారు. స్త్రీలల్లో నెలసరి సమస్యలు సహా పలురకాల అనారోగ్యాలను తాటిబెల్లం దూరం చేస్తుంది.

* పంచదారతో పోలిస్తే తాటిబెల్లంలోని ఖనిజ లవణాలు 60 రెట్లు ఎక్కువ. . టీ, కాఫీ, పండ్లరసాలకు కూడా ఈ బెల్లాన్ని ఉపయోగించొచ్చు. జీర్ణక్రియ ఎంజైమ్‌లను ఉత్తేజపరిచి అజీర్తిని దూరం చేయడమే కాకుండా శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది. ఇందులో ఉండే పీచు మలబద్ధకాన్ని దూరం చేస్తుంది.

Palm jaggery health benefits and uses in telugu

* రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయులను తాటిబెల్లంలో ఉండే ఇనుము, మెగ్నీషియం పెంచుతాయి. దీనివల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. ఫ్రీరాడికల్స్‌ నుంచి యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని కాపాడతాయి. కాల్షియం, పొటాషియం, భాస్వరం ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల బలహీనత నుంచి బయటపడొచ్చు. నెలసరి సమస్యలతోపాటు అధిక బరువు సమస్యలను తాటిబెల్లం పరిష్కరిస్తుంది.

* మైగ్రేన్‌ తలనొప్పి వచ్చినప్పుడు చెంచా బెల్లం పొడి వేసి చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. వేసవి వేడి నుంచి శరీరాన్ని రక్షిస్తుంది.

* పొడిదగ్గు, జలుబుకు తాటిబెల్లం ఔషధంలా పనిచేస్తుంది. గోరువెచ్చని కప్పు పాలల్లో చెంచా తాటిబెల్లం (Palm jaggery) పొడి, పావుచెంచా మిరియాలపొడి కలిపి తీసుకుంటే వెంటనే ఉపశమనం కలుగుతుంది.

* జలుబు వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మాన్ని తొలగించి, వాటి పనితీరును మెరుగుపరుస్తుంది. ఆస్తమాకీ దూరంగా ఉండొచ్చు.

* దీన్ని తినడంద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

* ఆహార గొట్టం, ఊపిరితిత్తులు, శ్వాసకోశ, ప్రేగులు, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపిస్తుంది. తద్వారా ప్రేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది.

* గోరువెచ్చని నీటిలో తాటిబెల్లం కలుపుకొని తాగడంవల్ల జలుబు, దగ్గు తగ్గుతుంది.

* రక్తపోటును నియంత్రించడానికి ఇది బాగా ఉపకరిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+