ఈ గింజలు గుండెకు మంచిది.. షుగర్ కంట్రోల్ అవుతుంది
షుగరు వస్తే దాన్ని కంట్రోల్ చేయడానికి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ప్రధానంగా ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కెమికల్స్ తో కూడిన మందులు మింగడంకన్నా సహజసిద్ధమైన ఆహారంతో షుగరును నియంత్రించవచ్చు. అందుకే మధుమేహ బాధితులు మఖానా తినాలని వైద్యులు సూచిస్తున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్: మఖానా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌లా పనిచేసే పాలీఫెనాల్, ఫ్లేవనాయిడ్స్ అధికంగా ఉంటాయి.ఇవి మన బాడీలో ఫ్రీ రాడికల్ ఎలిమెంట్స్, వాటి ప్రభావాలను తొలగించడంతోపాటు ప్యాంక్రియాస్ దాని పనులను పెంచడంలో కూడా సాయపడుతుంది. ఇన్సులిన్ ఉత్పత్తికి మేలు చేస్తుంది. దీనివల్ల షుగరు కంట్రోల్ అవుతుంది.

మెగ్నీషియం: వీటిల్లో మెగ్నీషియం ఉంటుంది. శరీర కణజాలాల్లో ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని అభివృద్ది చేస్తే, అది మన శరీరానికి సమర్థవంతగా ఉపయోగపడుతుంది. షుగరు ఉన్నవారికి ఇది చాలా మంచిది.
ఫైబర్ కంటెంట్: మఖానా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. షుగరు లెవల్స్ ను ఇది కంట్రోల్ చేస్తుంది. దీంతోపాటు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కూడా కంట్రోల్ చేస్తుంది. వీటిని తినడంవల్ల కడుపు త్వరగా నిండిన ఫీలింగ్ కలుగుతుంది.
లో గ్లైసెమిక్ ఇండెక్స్: మఖానాలో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ లెవల్స్ ఉంటాయి. హై షుగర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు క్రమంగా పెరిగి షుగర్ లెవల్ అదుపులో ఉంటుంది. వీటిని వేయించి తినొచ్చు.
గుండెకి మేలు:షుగరు పేషెంట్లు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే గుండె సమస్యలు వస్తాయి. మఖానాలో కొలెస్ట్రాల్ లెవల్స్ తక్కువగా ఉంటాయి. దీనివల్ల షుగరు తగ్గడమే కాకుండా గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. మఖానా గింజలని తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.












Click it and Unblock the Notifications