కండరాల పెరుగుదలను పెంచే రిచ్ ప్రోటీన్ కూరగాయలు
కండరాల పెరుగుదల అనేది కేవలం జంతు ప్రోటీన్లపైనే ఆధారపడి ఉండదు. కూరగాయలలో కూడా మనకు అవసరమైన ప్రోటీన్లు లభిస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల కండరాలు బలంగా ఉంటాయి, శరీరంలోని ఇతర అవయవాలకు కూడా పోషణ లభిస్తుంది. అయితే, కూరగాయలలో ప్రోటీన్ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి, కండరాల పెరుగుదలకు అవసరమైన మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడానికి వీటిని అధికంగా తీసుకోవాలి.
పాలకూర: పాలకూరలో ప్రోటీన్ తో పాటు ఇనుము, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా, రక్తహీనతను నివారించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

బఠాని : అన్ని రకాల బీన్స్ లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా, జీర్ణవ్యవస్థకు కూడా మంచిది. 100 గ్రాముల బఠానిలో సుమారు 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని సూప్, కూరల్లో ఉపయోగించడం వల్ల ఆహారానికి రుచితో పాటు పోషకాలు కూడా అందుతాయి.
బ్రోకోలీ : బ్రోకలీలో ప్రోటీన్ తో పాటు విటమిన్ సి, విటమిన్ కె వంటి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది కండరాల అభివృద్ధికి అవసరమైన విటమిన్లను అందిస్తుంది. గోభీ ప్రోటీన్‌తో పాటు ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది శరీరానికి తక్కువ కేలరీలను అందించి, కండరాల బలాన్ని పెంచుతుంది.
అస్పరాగస్ : ఆస్పరాగస్ లో ప్రోటీన్ తో పాటు ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఇ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది నరాల ఆరోగ్యానికి మంచిది. ఈ కూరగాయలో ప్రోటీన్ ఎక్కువగా ఉండటంతో పాటు నేచురల్ గా పని చేస్తుంది. ఇది బరువు నియంత్రణకు ఉపయోగపడుతుంది.
బంగాళదుంప ఆకులు : బంగాళదుంప ఆకుల్లో విటమిన్ ఎ, సి, కె, మరియు ప్రోటీన్ అధికంగా ఉంటుంది. కండరాలకు కావాల్సిన శక్తిని ఇది అందిస్తుంది.
ఎడమామి : ఎడమామి (తాజా సోయా పప్పులు) 100 గ్రాముల పరిమాణంలో 11 గ్రాముల ప్రోటీన్‌ను అందిస్తాయి. ఇది శరీరానికి అవసరమైన అన్ని 9 ప్రాథమిక అమినో ఆమ్లాలను కలిగి ఉంటుంది.
ముష్రూమ్ : షిటేకే మష్రూమ్స్ లో ప్రోటీన్ తో పాటు విటమిన్ డి, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ప్రోటీన్‌తో పాటు కండరాల కోసం అవసరమైన డి-విటమిన్ కూడా ముష్రూమ్‌లో ఉంటుంది. ఇది ప్రోటీన్ తీసుకునే వెజిటేరియన్స్‌కి మంచి ప్రత్యామ్నాయం.
జొన్నలు : జొన్నల్లో మోస్తరు ప్రోటీన్ ఉంటూ శక్తివంతమైన కార్బోహైడ్రేట్లతో సహజ న్యూట్రియెంట్‌గా పనిచేస్తుంది. ఇది కండరాల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది.
అవకాడో: అవకాడోలో హెల్తీ ఫ్యాట్స్ తో పాటు ప్రోటీన్ కూడా ఉంటుంది. ఇది కండరాల పెరుగుదలకు మాత్రమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా మంచిది.
ఎందుకు ఉపయోగకరం?
ఈ కూరగాయలు సులభంగా అందుబాటులో ఉండే ప్రోటీన్ వనరులుగా ఉండటంతో, వీటిని ఆహారంలో చేర్చడం వల్ల కండరాల పెరుగుదల, శక్తి, మరియు ఆరోగ్యాన్ని బలోపేతం చేసుకోవచ్చు. అధిక ప్రోటీన్ కోసం సరైన వంట పద్ధతులను అనుసరించడం కీలకం. మరింత ఆరోగ్యకరంగా ఉండటానికి నూనెను తక్కువగా ఉపయోగించండి. ఆహారంలో శాకాహార ప్రోటీన్ వనరులు చేర్చడం వల్ల కేవలం శారీరక బలం మాత్రమే కాదు, మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది












Click it and Unblock the Notifications