HMPV వైరస్ మీకు రాకుండా ఉండాలంటే ఇలా చేయండి

చైనా పేరు వింటేనే ప్రపంచం మొత్తం గడగడలాడిపోతోంది. కారణం రోజుకోరకమైన వైరస్ ఆ దేశం నుంచి బయటకు రావడమే. వుహాన్ ల్యాబ్ నుంచి బయటపడిన కరోనా వైరస్ ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. మానవుల జీవితాలన్నీ కరోనాకు ముందు, కరోనా తర్వాత అన్నట్లుగా మారిపోయాయి. తాజాగా చైనా నుంచి HMPV వైరస్ బయటపడింది. బెంగళూరుతోపాటు మహారాష్ట్రలో కేసులు నమోదవుతున్నారు. సాధారణ జలుబులా ఉండే ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు అనేక మార్గాలున్నాయి. ఈ వైరస్ సాధారణంగా జలుబు లాంటి లక్షణాలను కలిగిస్తుంది, కానీ చిన్న పిల్లలు, వృద్ధులు, ఇతర అనారోగ్యాలున్న వారికి ఇది తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
సబ్బు, నీటితో కనీసం 20 సెకన్ల పాటు చేతులను శుభ్రంగా కడగాలి. నీరు లేనప్పుడు ఆల్కహాల్-ఆధారిత హ్యాండ్ శానిటైజర్‌ని ఉపయోగించండి.
ముక్కు, నోటిని కవర్ చేయండి. దగ్గు లేదా తుమ్మినప్పుడు, ముక్కు, నోటిని టిష్యూతో, కర్ఛీఫ్ తో కప్పండి.
అనారోగ్యంతో ఉన్న వారిని దూరంగా ఉండండి. జలుబు, దగ్గు లేదా ఇతర అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని దూరంగా ఉంచండి.
పరిసరాలను శుభ్రంగా ఉంచండి. మీ ఇంటిని, ఇతర తరచుగా తాకే ఉపరితలాలను శుభ్రం చేయడంతోపాటు క్రిమిసంహారం చల్లండి.
ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. తగినంత నిద్ర పోవడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొని రోజూ వ్యాయామం చేయాలి.
HMPV వ్యాక్సిన్ ప్రస్తుతం అందుబాటులో లేదు కానీ ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది.

Precautions to be taken to avoid getting the hmpv virus

వైరస్ లక్షణాలు
జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, అలసట లాంటివి ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి. మీ కుటుంబ సభ్యులకు HMPV వైరస్ లక్షణాలు కనిపిస్తే, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనుభవిస్తే, జ్వరం తగ్గకపోతే, గర్భవతి అయినవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+