ఇవి గుండెకు మంచి ఆరోగ్యం.. షుగర్ కూడా కంట్రోల్..
శరీరానికి ఎంతో ప్రయోజనాన్ని అందిస్తుంది గుమ్మడికాయ. గుమ్మడి గింజలు అంతకంటే ఎక్కువ ప్రయోజనాన్ని అందిస్తాయని పోషకాహార నిపుణులు తెలియజేస్తున్నారు. ఇవి ప్రోస్టేట్, మూత్రాశయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
పురుషుల్లో ప్రోస్టేట్, మూత్రాశయ సమస్యలు సర్వ సాధారణం. గుమ్మడికాయ గింజల వినియోగించడంవల్ల ఈ సమస్యలను దాదాపుగా నిరోధించవచ్చు. మూత్ర సంబంధిత సమస్యల్లో ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తాయి. అలాగే మూత్రాశయం అతి చురుగ్గా ఉన్నప్పుడు కూడా ఇవి సమస్యను పరిష్కరిస్తాయి. ప్రస్తుత తరుణంలో మారుతున్న జీవన శైలి గుండె ఆరోగ్యంపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తోంది.

తక్కువ వయసులోనే ఎంతోమంది యువకులు గుండెపోటుతో కుప్పకూలి మరణిస్తున్నారు. గుమ్మడికాయ గింజలను క్రమం తప్పకుండా తీసుకోవడంవల్ల గుండెకు ఎంతో మేలు కలుగుతుంది. వీటిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, మెగ్నీషియం, జింక్ మరియు అసంతృప్త కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. అలాగే ఈ గింజల నూనె రక్తపోటును తగ్గించడంతోపాటు శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.
ప్రస్తుత రోజుల్లో మారుతున్న జీవన శైలివల్ల షుగరుకు గురవుతున్నవారు కోకొల్లలు. ఎక్కువ సమయం కూర్చొని పనిచేయడంతోపాటు ఆహారపు అలవాట్లు కూడా షుగరు రావడానికి కారణాలవుతున్నాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినప్పుడు గుమ్మడికాయ గింజల వినియోగం ఎంతో ప్రయోజనాన్ని కల్పిస్తాయి. టైప్ 2 మధుమేహాన్ని గుమ్మడి గింజలు అదుపులో ఉంచుతాయి. దీనిపై మరింత పరిశోధన జరుగుతోంది. గుమ్మడికాయ గింజలను తీసుకోవడం వల్ల మలబద్ధకం పోతుంది. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజు నిద్రించే ముందు గుమ్మడి గింజలను తింటే మంచి నిద్ర పడుతుంది. వీటిల్లో ఉండే ట్రిప్టోఫాన్ మంచి నిద్రను ప్రోత్సహించే అమైనో ఆమ్లం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి.












Click it and Unblock the Notifications