పాతకాలం నాటి 'దోసకాయ చికెన్'.. ఇలా చేస్తే ముక్క మిగల్చకుండా తింటారు..
దోసకాయను చాలా రకాలుగా చేసుకుంటారు. పప్పులో వేసుకుంటారు. పచ్చడి చేసుకుంటారు. టమాటోతో కలిపి కర్రీ చేసుకుంటారు. అయితే చికెన్ లో దోసకాయ వేసి వంట చేయడం మీరు ట్రై చేశారా..? పాతకాలం నాటి దోసకాయ చికెన్ ను ఎలా తయారు చేసుకోవాలి. తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి..? తక్కువ పదార్థాలతోనే చాలా సింపుల్ గా ఈ వంటను చేసుకోవచ్చు.
దోసకాయ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. చికెన్ ఒక కేజీ, దోసకాయ పెద్దసైజు ఒకటి, నూనె తగినంత, వెల్లుల్లి రెండు, పసుపు అర స్పూన్, కారం సరిపడా, ఉప్పు తగినంత, ధనియాలు 2 స్పూన్ లు, లవంగాలు ఐదు, దాల్చిన చెక్క కొద్దిగా, అల్లం ముక్క చిన్నది, గసగసాలు మూడు స్పూన్ లు, ఎండు కొబ్బరి కొద్దిగా, కొత్తిమీర తరుగు తీసుకోవాలి.
దోసకాయ చికెన్ తయారీ విధానం చూస్తే.. ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత దోసకాయను తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మిక్సీ గిన్నెలో అల్లం, ఎండు కొబ్బరి, గసగసాలు వేసి మెత్తగా గ్రైండింగ్ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఓ గిన్నెలోకి తీసుకోవాలి. అదే మిక్సీ గిన్నెలోకి ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, వెల్లుల్లి వేసి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని నూనె పోయాలి. నూనె వేడెక్కిన తర్వాత పసుపు, కరివేపాకు వేసి క్రిస్పీగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో చికెన్ వేసి బాగా కలిపి హై మంట మీద 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చికెన్ మగ్గిన తర్వాత ఆ మిశ్రమంలో రుచికి సరిపడా కారం, ఉప్పు వేసి ముక్కలకు పట్టేలా కలిపి మగ్గించాలి.

ఇప్పుడు అందులో ముక్క మునిగేవరకూ నీళ్లు పోసుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్టును వేసి మీడియం మంట మీద మగ్గించుకోవాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కలు వేసి మరోసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. దోసకాయ ముక్కలు ఉడికిన తర్వాత ధనియాల పొడి వేసి కాసేపు ఉడికించుకోవాలి. చివరిలో కొత్తిమీర తరుగు వేస్తే సరి. ఘుమఘుమలాడే దోసకాయ చికెన్ రెడీ అయినట్లే..












Click it and Unblock the Notifications