సీతాఫలం సరే... రామాఫలం గురించి తెలుసా?
సీతాఫలం గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఇందులో అనేక పోషకాలున్నాయి. దీన్ని తినడంవల్ల ఆరోగ్యం సొంతమవుతుందనే విషయం కూడా తెలుసు. ఎక్కువగా శీతాకాలంలోనే దొరుకుతుంది. సీతాఫలం గురించి మనందరికీ తెలుసుకానీ రామాఫలం ఉందని చాలామందికి తెలియదు. కానీ అందులో ఉండే పోషక విలువలు అపారం. అది తీసుకుంటే మంచి ఆరోగ్యం మన సొంతమవుతుంది. చాలా రుచికరంగా ఉంటుంది. దీన్ని ఎప్పటికప్పుడు తాజాగా తినాలి. స్మూతీలు, షేక్స్ వంటివాటిల్లో కలిపి తీసుకోవచ్చు. రామాఫలం తీసుకోవడంవల్ల కలిగే అధిక ప్రయోజనాలను తెలుసుకుందాం.
జీర్ణ వ్యవస్థకు మేలు: రామాఫలంలో ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు తగ్గుతాయి. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో తోడ్పడుతుంది.

గుండె ఆరోగ్యానికి: రామాఫలంలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల రక్తపోటును నియంత్రిస్తుంది. గుండె సంబంధిత వ్యాధులను నిరోధించడానికి ఉపయోగపడుతుంది.
క్యాన్సర్ నిరోధకం: రామాఫలంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
చర్మ ఆరోగ్యానికి: రామాఫలంలో విటమిన్ సి అధికంగా ఉండటం వల్ల చర్మాన్ని మెరుగుపరుస్తుంది. చర్మం ముడతలు పడకుండా చూసి కాంతినిస్తుంది.
ఎముకల ఆరోగ్యానికి: రామాఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
మధుమేహ నియంత్రణ: రామాఫలంలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.
రామాఫలాన్ని మితంగానే తీసుకోవాలి. లేదంటే వాంతులతోపాటు కడుపునొప్పి వస్తుంది.
కీళ్ల నొప్పులతో బాధపడే వారికి రామాఫలం దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు శరీరంలో ఏర్పడే ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టంతో పోరాడతాయి. దీనివల్ల కీళ్ల నొప్పులు దూరమవుతాయి.












Click it and Unblock the Notifications