ముఖం తెల్లగా అవడానికి ఇలా చేయండి!
పాలు తాగడంవల్ల ఎంత ఆరోగ్యమో తెలిసిందే. చర్మ కణాలను మెరుగ్గా చేస్తాయి. వీటిని వాడటంవల్ల చర్మం తేమగా మారి కణజాలాలు ఉత్తేజితం చెందుతాయి. పచ్చి పాలల్లో విటమిన్స్ బి12, బి6,ఎ, డి2, లాక్టిక్ యాసిడ్, కాల్షియం, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవన్నీ కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచడమే కాకుండా మచ్చలు లేని చర్మాన్ని అందిస్తాయి. పాలను ముఖానికి ప్యాక్ లా ఎలా వేసుకోవాలో చూద్దాం.
పాలు అవకాడో ప్యాక్..
అవకాడో ముక్కలు కొన్ని
పాలు 4 స్పూన్లు
అవకాడోని పొట్టుతీసి సగం వరకూ ముక్కలు చేసి మెత్తగా చేసుకోవాలి. ఇందులో పచ్చిపాలు కలిపి పేస్టులా చేయాలి. దీన్ని అప్లై చేసేముందు ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ఈ పేస్ట్ ను అప్లై చేసి పూర్తిగా ఆరిపోయేవరకు అలాగే ఉంచాలి. అనంతరం గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే చాలు.. నల్లగా మారిన ముఖం కూడా మెరిసిపోతుంటుంది.

పాలు, పసుపుతో ప్యాక్..
పచ్చిపాలు 4 స్పూన్లు
పసుపు పొడి ఓ చెంచా
పచ్చిపాలను ఓ గిన్నెలోకి తీసుకొని వాటిలో పసుపు కలిపి పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. తర్వాత చల్లని నీటితో కడుక్కుంటే ముఖం మెరిసిపోతుంది. ప్రతిరోజు దీన్ని వాడొచ్చు.
పాలు బాదం ప్యాక్..
పచ్చి పాలు 4 చెంచాలు
బాదంపప్పులు 6
బాదంపప్పుని పాలల్లో వేసి రాత్రి మొత్తం నానబెట్టి ఉదయాన్నే తొక్కు తీసి మెత్తగా పేస్టులా చేయాలి. దీనిని ముఖానికి పట్టించిన తర్వాత 20 నిమిషాలు ఉండి తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. చర్మంపై ఉండే మృతకణాలను తొలగించి మంచి రంగునిస్తుంది.
పాలు, తేనె, నిమ్మరసంతో..
పచ్చిపాలు 3 స్పూన్లు
తేనె 1స్పూన్
నిమ్మరం 1 స్పూన్
పచ్చిపాలలో తేనె, నిమ్మరసం వేసి బాగా కలపాలి. దీనిని ముఖానికి పట్టించి ఆరనివ్వాలి. పావుగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
పాలలోని క్లెన్సింగ్, తేనెలోని మాయిశ్చరైజింగ్, బ్లీచింగ్ గుణాలు కలిసి చర్మంపై మృత కణాలను తొలగిస్తాయి. వారానికి 2 నుంచి 3 సార్లు ఈ ప్యాక్ చేసుకోవచ్చు.
పాలు, శనగపిండి, ముల్తానీ మట్టి..
శనగపిండి 1 స్పూన్
ముల్తానీ మట్టి 1 స్పూన్
పాలు 2 స్పూన్లు
ముల్తానీ మట్టి, శనగపిండిలో పాలు వేసి పేస్టులా చేసి ముఖానికి పట్టించాలి. అరగంట తర్వాత చల్లటి నీటిని స్ప్రే చేస్తూ, కొద్దిగా స్క్రబ్ చేస్తూ కడగాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నిగనిగలాడుతుంది.












Click it and Unblock the Notifications