రెస్టారెంట్ స్టైల్​ క్రిస్పీ ఆలూ ఫ్రై.. ఇలా చేస్తే టేస్ట్ నెక్స్ట్ లెవెల్..!

ఆలూను ఫ్రై చేసుకున్నా.. టమాటాతో చేసినా.. కుర్మా చేసినా టేస్టీగానే ఉంటుంది. ఆలూ కర్రీ అన్నంతోపాటు చపాతీల్లోనూ అద్భుతంగా ఉంటుంది. అయితే రెస్టారెంట్ స్టైల్ లో క్రిస్పీగా ఆలూ ఫ్రైను ఎలా తయారు చేసుకోవాలి..? కావాల్సిన పదార్థాలు ఏంటి..? ఆలూ ఫ్రై చేయడానికి గల పదార్థాలు చూస్తే.. బంగాళా దుంపలు మూడు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత, కారం టీ స్పూన్, మిరియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు సరిపడా, నూనె తగినంత, నిమ్మరసం తగినంత, కరివేపాకు తీసుకోవాలి.

క్రిస్పీ ఆలూ ఫ్రై ఎలా తయారు చేయాలంటే.. ముందుగా బంగాళ దుంపలను మీడియం సైజులో కట్ చేసుకుని ఓ గిన్నెలోకి తీసుకుని ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఆలూ ముక్కలు మరీ మెత్తగా కాకుండా సగానికిపైగా ఉడికే విధంగా చూసుకోవాలి. వాటిని ఓ బౌల్ లోకి తీసుకోవాలి. అందులోనే కారం, ధనియాల పొడి, మసాలా పొడి, మిరియాల పొడి వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, అల్లం పేస్టు యాడ్ చేసుకోవాలి. అందులోనే నిమ్మరసం కొద్దిగా వేసుకుని అరగంటపాటు మేరినేట్ చేసుకోవాలి.

Restaurant Style Crispy Potato Fry Recipe Perfect Aloo Fry at Home

ఆ మిశ్రమంలోనే కోటింగ్ కోసం కొద్దిగా బియ్యం పిండి, అలాగే కార్ల్ ఫ్లోర్ ను కలుపుకోవాలి. అందులోనే రెండు స్పూన్ ల మైదా లేదా శనగ పిండిని వేసుకోవాలి. అలా ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని దాంటో తగినంత నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో మ్యారినేట్ చేసుకున్న ఆలూ ముక్కలను ఒక్కొక్కటిగా వేసి ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకొనేటప్పుడు అందులోనే నాలుగైదు పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అంతే వాటిని ఓ బౌల్ లోకి తీసుకుని దానిపై కొంచెం చాట్ మసాలా వేస్తే సరి.. సూపర్ టేస్టీగా ఉండే క్రిస్పీ ఆలూ ఫ్రై రెడీ అయినట్లే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+