కూల్ డ్రింక్స్‌తో నోటి క్యాన్సర్ ముప్పు.. తాజా అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. కానీ నేటి ఆధునిక జీవనశైలిలో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా యువతరం కూల్ డ్రింక్స్, స్వీట్ డ్రింక్స్ అంటూ తీపి పానీయాలకు బానిసలవుతున్నారు. వీటివల్ల కలిగే అనర్థాల గురించి తెలిసినా ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రోజుకు ఒక్క తీపి పానీయం తాగే మహిళలకు నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఐదు రెట్లు ఎక్కువ అని తేలింది!

నోటి కుహరంలో ఏర్పడే క్యాన్సర్ మహిళల్లో వేగంగా పెరుగుతోందని వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. ముఖ్యంగా పొగత్రాగని, మద్యం సేవించని యువతుల్లో ఈ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదు కావడం వైద్య నిపుణులను సైతం ఆందోళనకు గురిచేస్తోంది. దీనికి ప్రధాన కారణం ఆహారపు అలవాట్లేనని పరిశోధకులు చెబుతున్నారు.

risk-of-oral-cancer-from-cold-drinks-shocking-facts-come-to-light-in-a-recent-study

తీపి పానీయాలే ప్రధాన కారణమా?
జమా ఓటోలారిన్జాలజీ-హెడ్ అండ్ నెక్ సర్జరీ జర్నల్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, తీపి పానీయాలకు పెద్దపేగు , జీర్ణశయాంతర క్యాన్సర్‌లతో సంబంధం ఉందని తెలిపింది. కానీ, తల, మెదడు క్యాన్సర్‌లతో వాటి సంబంధంపై ఇప్పటివరకు పెద్దగా పరిశోధనలు జరగలేదు. ఈ నేపథ్యంలో వాషింగ్టన్ విశ్వవిద్యాలయం చేసిన ఈ అధ్యయనం ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

అయితే "నోటి కుహర క్యాన్సర్.. రొమ్ము , పెద్దపేగు క్యాన్సర్ కంటే తక్కువ . ప్రతి సంవత్సరం 100,000 మందికి 4-4.3 కేసులు నమోదవుతున్నాయి. అయితే, పొగత్రాగని, మద్యం సేవించని మహిళల్లో నోటి కుహర క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది" అని అధ్యయన ప్రధాన రచయిత , వాషింగ్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ యొక్క ఓటోలారిన్జాలజీ హెడ్ అండ్ నెక్ సర్జరీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ బ్రిటనీ బార్బర్ పేర్కొన్నారు.

తీపి పదార్థాలు నేరుగా క్యాన్సర్‌కు కారణం కానప్పటికీ, వాటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఊబకాయం అనేక రకాల క్యాన్సర్లకు ముఖ్యంగా నోటి క్యాన్సర్‌కు ప్రధాన ప్రమాద కారకం అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, తీపి పానీయాలు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో మంట, డయాబెటిస్ వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇవి కూడా క్యాన్సర్‌కు కారణమయ్యేవే అని చెబుతున్నారు.

నోటి క్యాన్సర్ అంటే ఏమిటి?
నోటి క్యాన్సర్ మీ నోటి లోపల ఏర్పడుతుంది. ఇది పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గలు, నోటి పైకప్పు లేదా నోటి దిగువ భాగంలో ఎక్కడైనా సంభవించవచ్చు. సాధారణంగా నోటిలో వచ్చే సమస్యల్లాగే ఇది కూడా మొదలవుతుంది. తెల్లటి మచ్చలు లేదా రక్తస్రావం అయ్యే పుండ్లు వంటివి కనిపిస్తాయి. కానీ సాధారణ సమస్యలకు, క్యాన్సర్‌కు మధ్య తేడా ఏమిటంటే, ఈ మార్పులు రెండు వారాల్లో తగ్గవు. చికిత్స చేయకుండా వదిలేస్తే, నోటి క్యాన్సర్ మీ నోరు , గొంతు నుండి తల , మెడలోని ఇతర భాగాలకు వ్యాపిస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, నోటి కుహర క్యాన్సర్ నిర్ధారణ అయిన ఐదేళ్ల తర్వాత 63 శాతం మంది మాత్రమే జీవించి ఉన్నారు. అందుకే, నోటి క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడం చాలా ముఖ్యం.

నోటి క్యాన్సర్ సంకేతాలు, లక్షణాలు:

నోటి క్యాన్సర్‌కు సంబంధించిన అనేక సంకేతాలు , లక్షణాలు సాధారణ సమస్యలు లేదా నోటిలో వచ్చే మార్పులుగా పొరబడే అవకాశం ఉంది.పెదవిపై లేదా నోటి లోపల పుండ్లు సులభంగా రక్తస్రావం అవుతాయి, రెండు వారాల్లో నయం కావు. నోటిలో కారణం లేకుండా రక్తస్రావం అవడం. ముఖం , మెడపై లేదా నోటిలో తిమ్మిరి, నొప్పి లేదా సున్నితత్వం కనిపించడం. నమలడం లేదా మింగడం, మాట్లాడటం లేదా దవడ లేదా నాలుకను కదిలించడంలో ఇబ్బంది. కారణం లేకుండా బరువు తగ్గడం. దీర్ఘకాలిక దుర్వాసన రావడం వంటి లక్షణాలు కన్పించవచ్చు. కాబట్టి, వీటిని తేలికగా తీసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.

అనారోగ్యాల పాలు చేస్తున్న తీపి పానీయాలు తాగడం తగ్గించండి. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. నోటి ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. నోటిలో ఎలాంటి మార్పులు కనిపించినా వెంటనే వైద్యులను సంప్రదించండి. ముందు జాగ్రత్తలు తీసుకుంటే, నోటి క్యాన్సర్ ముప్పును నివారించవచ్చు.

గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. ఏదైనా ఆరోగ్య సమస్యలపై మీకు సందేహాలు ఉంటే, దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+