ఈ ఉప్పును వాడితే అనేక ఆరోగ్య ప్రయోజనాలట..!
వంటకాలు ఏవైనా ఉప్పు లేనిదే టేస్ట్ రాదని అందరికీ తెలిసిందే. కానీ మారుతున్న జీవనశైలి ప్రకారం.. ఉప్పు వినియోగం తగ్గించాలని నిపుణులు చెబుతూనే ఉంటారు. అధికంగా ఉప్పును వాడితే అనేక అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని చెబుతున్నారు. అయితే సాధారణ ఉప్పు కంటే రాక్ సాల్ట్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందులో శుద్ధి చేసిన ఉప్పు కంటే ఎక్కువ ఖనిజాలను ఉంటాయి. సాధారణంగా.. ఇది సోడియం క్లోరైడ్ తో పాటు పొటాషియం, మెగ్నీషియం, జింక్, అయోడిన్ వంటి అనేక ఖనిజాలను కలిగి ఉంటుంది. ఆహారంలో రుచిని పెంచడానికి, జీర్ణక్రియకు సహాయపడటానికి.. అలాగే మసాలాల రుచిని నిలుపుకోవడానికి ఈ ఉప్పును ఉపయోగిస్తారు.
సాధారణంగా బీపీ ఉన్నవాళ్లు ఉప్పు వాడితే రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంటుంది. అలాంటి వారు హిమాలయ రాక్ సాల్ట్ వాడితే మెల్లగా ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో సోడియం పరిమితంగా ఉంటుంది. అయితే ఇది కూడా పరిమితంగా వాడాలని సూచిస్తున్నారు. మిగతా సాల్ట్స్ తో పోలిస్తే దీని ఉపయోగాలు అధికంగా ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయని, ఇవి శరీరం నుంచి విషాన్ని బయటకు పంపి పేగులను శుభ్రపరచడంతో పాటు గట్ హెల్త్ నూ మెరుగుపరుస్తుందని నిపుణులు వివరిస్తున్నారు.

అలాగే రాక్ సాల్ట్ వినియోగించడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపరచడం, కడుపు ఉబ్బరం, అసిడిటీ లక్షణాలు తగ్గుతాయని వివరిస్తున్నారు. మలబద్ధకం వంటి ఉదర సంబంధిత సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇది జీర్ణ ఎంజైమ్స్ ఉత్పత్తిని ప్రేరేపించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications