సామాన్లు కాదు కళ్లు జాగ్రత్త. కళ్ళు బాగుంటేనే జీవితం క్లియర్‌గా కనిపిస్తుంది

"సర్వేంద్రియానం నయనం ప్రధానం" అన్నారు పెద్దలు. సరే అంత పెద్ద పెద్ద మాటలు మనకు అర్ధం కాదులే అనుకున్నా.. కాటుక కళ్లును చూస్తే పోతుందే మతి పోతుందే.. అంటూ ట్యూన్స్ ను హమ్ చేసుకుందాం. ప్రకృతి చాలా అందమైనది. ఆ అందాన్ని ఆస్వాదించాలంటే కళ్లు కావాల్సిందే. మరీ ముఖ్యంగా ఎవరినైనా ఇంప్రస్ చేయాలనుకున్నా మనం వాడే ఒకే ఒక్క పదం "కళ్లలో పెట్టి చూసుకుంటా". "కంటికి రెప్పలా కాపాడుకుంటా" అని.. మరి ఈ రేంజ్ లో పులిహోర కలిపే మనం.. ముందు మన కళ్లను జాగ్రత్తగా చూసుకోవాల్సిందే కదా. మన రోజులో కనీసం 10-12 గంటలు కళ్ళు స్క్రీన్‌కి అంకితమైపోతున్నాయి. ఫలితంగా కళ్లలో మంట, నీళ్లు రావడం, తలనొప్పి, చూపు తగ్గుతున్న భావన మనకు కలుగుతున్నాయి.

ఉదయం లేవగానే ఫోన్ ఆన్ చేసి కంటికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాం. బాత్ రూంలో కూడా కంటికి రెస్ట్ ఇవ్వకుండా వాడేస్తున్నాం. మళ్లీ ట్రాఫిక్ లో పడుతూ లేస్తూ ఆఫీస్ కు వచ్చి కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు చూస్తున్నాం. మధ్యలో బ్రేక్ దొరికితే చాలు మళ్లీ ఫోన్. ఇలా పడుకునే వరకు కళ్లకు రెప్పలకంటే ఫోన్ స్క్రీనే ఎక్కువ అంటుకుపోతుంది. అందుకే చిన్న వయసులోనే పిల్లలకు కళ్ల జోడులు వచ్చేస్తున్నాయి. 2025 అంతా ట్రెండింగ్ రీల్స్ చూసి, షేర్ చేసి అలిసిపోయావ్ బ్రో. మరి 2026 లో అయినా కంటిని కొంచం జాగ్రత్తగా చూసుకో.. లేకపోతే నేత్రానందం మిస్ అవుతావు.

Screen Addiction Is Ruining Our Eyes Why Eye Care Matters More Than Ever in the Digital Age

సామన్లు బాగుండాలని బాడీ షేమింగ్ చేసిన జనరేషన్.. కళ్లు బాగుండాలని హెల్త్ టిప్స్ మాత్రం పాటించకపోవడం సో శాడ్. ఈ క్రమంలోనే నీ కోసం కొన్ని టిప్స్ తీసుకొచ్చా. ఈ టిప్స్ పాటించి నీ కళ్లు ఎంత ఆరోగ్యంగా ఉన్నాయో తెలుసుకోండి.

2026 నుంచి కొత్త అలవాటు: స్క్రీన్‌ నుంచి కళ్లను కాపాడుకునే లైఫ్ స్టైల్

1. 20-20-20 రూల్ - కళ్లకు ప్రాణవాయువు

ప్రతి 20 నిమిషాలకు 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువును 20 సెకన్లు చూడాలి. ఇది చిన్న అలవాటే కానీ డిజిటల్ ఐ స్ట్రెయిన్‌ను 60% వరకు తగ్గిస్తుంది.

📌 టిప్: కంప్యూటర్ దగ్గర స్టిక్కర్ పెట్టండి - "20-20-20"

2. మొబైల్ రీల్స్‌కు టైమ్ లిమిట్ తప్పనిసరి

రీల్స్ చూస్తూ చూస్తూ.. కంటి బ్లింకింగ్ తగ్గిపోతుంది. కళ్ళు పొడిబారిపోతాయి. రోజుకి గరిష్టంగా 30-45 నిమిషాలు మాత్రమే రీల్స్ చూసేలా ప్లాన్ చేసుకోండి. నిద్రకు ముందు కనీసం 1 గంట స్క్రీన్‌కు దూరంగా ఉండటానికి తీవ్రంగా ప్రయత్నించండి. 2026 నుంచి ఇది ఒక హెల్త్ రిజల్యూషన్ చేయండి.

3. కళ్ళు బ్లింక్ చేయడం - మర్చిపోయిన అలవాటు

సాధారణంగా మనం నిమిషానికి 15-20 సార్లు బ్లింక్ చేస్తాం. స్క్రీన్ చూస్తే అది 5-7కి పడిపోతుంది. అందుకే కళ్లు పొడిబారడం, ఎర్రబడటం, మంటగా అనిపిస్తుంటాయి.

📌 చిట్కా:
ప్రతి 5 నిమిషాలకు ఒకసారి జాగ్రత్తగా 5-6 సార్లు బ్లింక్ చేయండి. కంటిని తడిగా ఉంచడానికి ప్రయత్నించండి.

4. నైట్ మోడ్ & బ్లూ లైట్ ఫిల్టర్ తప్పనిసరి

బ్లూ లైట్ వల్ల కంటి నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. నిద్ర భంగం కలుగుతుంది. కాబట్టి చిన్న సెట్టింగ్స్ చేంజ్ చేసి మీ కళ్లను సేవ్ చేసుకోవచ్చు

కంప్యూటర్ - Night Light ON
మొబైల్ - Eye Comfort / Blue Light Filter ON

ఇది చిన్న సెట్టింగే కానీ కళ్లుకు పెద్ద రక్షణ ఇస్తుంది.

5. సరైన లైటింగ్ - అంధకారం + స్క్రీన్ = ప్రమాదం

చీకటి గదిలో స్క్రీన్ చూస్తే కళ్ళపై ఒత్తిడి రెట్టింపు అవుతుంది. కాబట్టి స్క్రీన్ వెనుక మృదువైన లైట్ ఉండాలి. పూర్తిగా చీకట్లో ఫోన్ చూడకండి. చూస్తే కళ్లు పోవడం పక్కా.

6. మీ ప్లేట్‌లో ఇవి ఉండాలి

ఒంటికే కాదు కళ్లుకు కూడా ఆహారం కావాల్సిందే. క్యారెట్, పాలకూర, మామిడి, గుడ్డు, చేపలు (ఓమేగా-3) తీసుకోవడం ద్వారా కంటి నరాలకు బలంగా ఉంటాయి. ఒత్తిడిని తట్టుకుంటాయి.

7. కంటి వ్యాయామాలు - రోజుకి 5 నిమిషాలు

రోజుకు ఒక్కసారి:
కళ్లను మూసి తెరవడం - 10 సార్లు
పైకి, కిందకి, ఎడమ, కుడి చూడడం
పామింగ్ (చేతులతో కళ్ళు కప్పడం) - 1 నిమిషం

ఇవి ఫ్రీ & ఎఫెక్టివ్.

8. నిద్రే అసలైన కంటి టానిక్. రోజుకు కనీసం 7-8 గంటల నిద్ర పోవాల్సిందే. నిద్రకు ముందు ఫోన్ పక్కన పెట్టాల్సిందే. నిద్ర లేకపోతే ఏ కంటి డ్రాప్స్ కూడా పనిచేయవు.

2026 కొత్త సంవత్సరం అంటే కొత్త ఫోన్ కాదు... కొత్త ల్యాప్‌టాప్ కాదు. కళ్ళను కాపాడుకునే కొత్త అలవాటు కావాలి. కళ్ళు బాగుంటేనే జీవితం క్లియర్‌గా కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+