కూల్ డ్రింక్ తాగిన తర్వాత ఏమవుతుందో తెలుసా?
మండే ఎండల్లో దాహార్తి తీర్చుకునేందుకు చల్లచల్లగా కూల్‌డ్రింక్ తాగుతుంటే ప్రాణం లేచొచ్చినట్టు అనిపిస్తుంది. కానీ ఆ కూల్ డ్రింకే ప్రాణాలను తీసే కెమికల్స్ ను కూడా కలిగివుంటుంది. కూల్ డ్రింక్ తాగిన తర్వాత మన శరీరంలో ఎటువంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకుందాం.
మొదటి 10 నిమిషాలు
నాలుగు టీ స్పూన్ల పంచదార మన శరీరంలోకి చేరుకుంటుంది. అయితే చక్కెర అధికంగా అవడంవల్ల వాంతి అవకుండా కూల్ డ్రింక్ తయారుచేసే సమయంలో ఫాస్పారిక్ యాసిడ్ ను వాడతారు.

తర్వాత 20 నిమిషాలు
రక్తంలో చక్కెర శాతం పెరుగుతుంది. దీనివల్ల ఇన్సులిన్ ఉధృతి పెరిగి అధికంగా ఉండే చక్కెరను కాలేయం కొవ్వుగా మారుస్తుంది.
తర్వాత 40 నిమిషాలు
కూల్ డ్రింక్ లో ఉండే కెఫీన్ రక్తపోటు రావడానికి కారణమవుతుంది. కాలేయంలో పేరుకుపోయే కొవ్వును వదిలించడం కోసం మెదడులో అడినోసిన్ రిసెప్టార్లు మూసుకుపోతాయి.
తర్వాత 45 నిమిషాలు
ఫాస్ఫారిక్ యాసిడ్ చిన్న పేగుల్లో క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌లను బైండ్ చేస్తుంది. చక్కెరతో శరీరంలోని క్యాల్షియం బయటకు వెళ్లిపోతుంది.
తర్వాత 60 నిమిషాలు
కెఫీన్ డయూరిటిక్‌గా పని చేస్తుంది. తద్వారా మూత్రం తోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్, సోడియం, ఎలక్ట్రోలైట్లు బయటకు వెళ్లిపోతాయి.
ఆ తర్వాత
షుగర్ క్రాష్ వల్ల చీకాకు, నిస్సత్తువలు వేధిస్తాయి. మూత్రంలో ఇతర న్యూట్రియంట్లను కూడా కోల్పోతాం కాబట్టి త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతాం
మరిన్ని దుష్ప్రభావాలు
ప్రతిరోజు మనం తీసుకున్న కప్పు కాఫీకన్నా 10 రెట్లు ఎక్కువ కెఫీన్ ఉంటుంది. దీనివల్ల శరీరం దుష్ప్రభావానికి లోనవుతుంది. రక్తపోటు పెరగడంతోపాటు గుండె కొట్టుకునే తీరులో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని సందర్భాల్లో గుండెపోటు రావడానికి కూడా అవకాశం ఉంటుంది. కిడ్నీలపై విపరీతమైన భారం పడుతుంది. కూల్ డ్రింక్స్ లో ఉండే యాసిడ్స్, చక్కెర పంటి మీద ఉండే ఎనామిల్ ను పాడుచేస్తాయి.
-
గుడ్డులో పచ్చ సొన ఎవరికి మంచిది, ఎవరికి డేంజర్..!! -
మటన్ బోన్ సూప్.. హెల్దీగా, యంగ్ గా కనిపించాలంటే ఇలా చెయ్యండి! -
"గోంగూర మష్రూమ్ కర్రీ" ఇలా చేస్తే స్వర్గమే !! -
ఏడడుగులు వేయబోతున్న స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి.. పెళ్లి కొడుకు ఫిక్స్ ?? -
ఈ నెల 15 నుంచి అశుభ దినాలు ప్రారంభం- చేయకూడని కార్యక్రమాలు -
విద్యా సంస్థలకు రేపు రెండో శనివారం సెలవు రద్దు, ఒంటి పూట బడులపై తాజా నిర్ణయం..!! -
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్!












Click it and Unblock the Notifications