చలికాలం పొడి చర్మం సమస్య... సింపుల్ చిట్కాలివే!

చలికాలంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండటం వల్ల, తక్కువ తేమ శాతం కారణంగా చర్మం పొడిబారుతుంది .అది మనకు చిరాకును కలిగిస్తుంది. చర్మం దురద, మంటకు గురవుతుంది. అయితే శీతాకాలంలో చర్మం పొడిబారే సమస్యతో బాధపడే వారికి సింపుల్ హోమ్ రెమెడీస్ ఇప్పుడు మీకోసం. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండడం కోసం శరీరాన్ని ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవాలి.

చలికాలం చర్మ సంరక్షణ ఇలా
ఎటువంటి మాయిశ్చరైజర్స్ లేనివాళ్లు కొబ్బరి నూనెను ఒంటికి, ముఖానికి అప్లై చేసుకుంటే మంచిది. చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా కాపాడుకోవాలి . అందుకోసం నీటిని ఎక్కువగా తాగాలి. చలికాలంలో ఉపయోగించే సబ్బులు, క్లెన్సర్లు, లోషన్లు కఠినమైన రసాయనాలు లేకుండా ఉండే వాటిని ఎంచుకోవాలి.

Skin get dry in winter Try these natural tips

ఇలా చేస్తే చర్మం పొడిబారటం గ్యారెంటీ
వాసన ఎక్కువగా ఉండే లోషన్లలో ఎక్కువ రసాయనాలు కలుస్తాయి అనే విషయాన్ని గుర్తించి, ఎక్కువ వాసన లేని వాటిని ఎంచుకోవాలి. చలికాలం ఎక్కువసేపు వేడి నీళ్ల స్నానం కూడా చేయకూడదు. వేడినీళ్ల స్నానం చేస్తే హాయిగా ఉందని ఎక్కువసేపు వేడినీళ్ల స్నానం చేయడం వల్ల కూడా చర్మానికి అవసరమైన తేమ పోతుంది. దీనివల్ల చర్మం పొడిబారి ఇబ్బందికరంగా తయారవుతుంది.

చలికాలంలో ఈ ఫుడ్ తినండి
ఇక చలికాలం చల్లని గాలుల కారణంగా చర్మం పొడి మారుతుంది. కనుక చల్లని గాలుల నుంచి చర్మాన్ని కాపాడుకునేలా బట్టలు వేసుకోండి. చలికాలంలో సూర్యరశ్మి ఎక్కువగా మన శరీరం పైన పడకపోవడం వల్ల విటమిన్ డి లోపంతో కూడా చర్మం పొడిబారుతుంది. కనుక చలికాలంలో విటమిన్ రిచ్ ఫుడ్ ను ఎక్కువగా తినడం మంచిది.

చిన్న టిప్స్ తో చర్మ ఆరోగ్యం
చలికాలంలో మన చర్మానికి మేలు కలిగించే లాగా ఆహారంలో మార్పులు చేసుకోవడం తరచూ నీటిని తాగడం మన చర్మ సమస్యలను పరిష్కరిస్తుంది. శీతాకాలంలో ఆరోగ్యకరమైన చర్మం కోసం కొబ్బరి నూనె, పాల మీగడ, నెయ్యి, వెన్న వంటి వాటిని చర్మానికి రాసుకోవటం చేస్తే చర్మం సాఫ్ట్ గా మారుతుంది. మనం ఇంట్లోనే చేసే ఈ చిన్న చిన్న టిప్స్ ను ఫాలో అయితే మీ చర్మం సున్నితంగా ఆరోగ్యంగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+