పెరుగుతున్న స్లీప్ డివోర్స్..నిద్ర విడాకులు తీసుకుంటున్న యువ జంటలు
ప్రస్తుతం సమాజంలో యువ జంటలు ఒక కొత్త సమస్యను ఎదుర్కొంటున్నారు. రాత్రి నిద్ర విడాకులు తీసుకోవడం, పగలు మళ్ళీ కలిసి తిరగడం ప్రస్తుతం ఎక్కువగా కనిపిస్తుంది. యువ దంపతుల మధ్య నడుస్తున్న ఈ కొత్త ట్రెండ్ స్లీప్ డివోర్స్ ఏమిటి? ఇది మంచిదా కాదా అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
యువ జంటల్లో పెరుగుతున్న స్లీప్ డివోర్స్
స్లీప్ డివోర్స్, నిద్ర విడాకులు.. ఈ పేరు వినగానే మనలో చాలామందికి కొత్తగా, ఇదేం విడాకులు అన్న ఆలోచనను కలగజేస్తుంది. నిద్ర విషయంలో విడాకులు తీసుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అంటారు. నిజానికి యువ జంటలు విడాకులు తీసుకోవడం లేదు. కాకుంటే వారు మంచి నిద్ర కోసం రాత్రివేళ విడివిడిగా పడుకుంటున్నారు అంతే. ఒకరి నిద్రకు మరొకరు ప్రాధాన్యతనిస్తూ ఎవరికీ నిద్రాభంగం కలగకుండా వేరే గదిలో పడుకోవడాన్ని స్లీప్ డివోర్స్ అంటారు.

నిద్ర విషయంలో ఎవరి అలవాట్లు వారివే
ప్రస్తుతం యువ జంటల్లో ఈ విధానం పెరిగిపోయింది. కొంతమందికి గురక పెట్టే అలవాటు ఉంటుంది. అయితే వారి పార్ట్ నర్ ఆ గురకను భరించడం చాలా కష్టంగా ఉంటుంది. కొందరు 9 గంటలకే నిద్ర పోవాలి అనుకుంటే, ఇంకొందరు మంచి సినిమా చూసి లేటుగా నిద్ర పోవాలి అనుకుంటారు. ఒకరికి ఏసీ, ఫ్యాన్ రెండు కావాల్సి ఉంటే, ఇంకొకరికి చలి దెబ్బకు నిద్ర పట్టదు.
స్లీప్ డివోర్స్ తీసుకుంటున్న వారు ఈ ఏజ్ గ్రూప్ వారే
ఇలా ఒకరి నిద్ర అలవాట్లు ఇంకొకరికి సరిపోకపోవడంతో స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు. ఈ విధానంలో ఎవరి కంఫర్ట్ జోన్ లో వారు నిద్రపోవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా 30, 40 ఏజ్ లో ఉన్నవారు ఈ విధానానికి అలవాటు పడుతున్నారు. గతంలో కొంత ఎవరు ఎలా ఉన్నా సర్దుకుపోయే వారు. కొన్నిసార్లు నిద్రను కూడా తమ వారి కోసం త్యాగం చేసేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
స్లీప్ డివోర్స్ పై అధ్యయనం
హాయిగా నిద్రపోవడం కోసం తమ జీవిత భాగస్వామిని కూడా పక్కనపెట్టి తాత్కాలికంగా స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు. నువ్వు కంఫర్ట్ గా పడుకో, నేను పక్క గదిలో కంఫర్ట్ గా నిద్రపోతాను అని చెబుతున్నారు. అయితే ఈ విధానం చాలా మంచి పద్ధతని 2023 లో దీనిపైన అధ్యయనం నిర్వహించిన అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ అభిప్రాయపడింది.
నిద్రతో శారీరక , మానసిక ఆరోగ్యం
ఒకరి కోసం ఇంకొకరు నిద్రను త్యాగం చేసి ఇబ్బంది పడే కంటే, ఎవరికి వారు హాయిగా నిద్రపోయి, మిగతా సమయం అంతా కలిసి ఉండటం మంచిది అని అభిప్రాయం ఈ అధ్యయనంలో వ్యక్తం అయింది. ప్రతి ఒక్కరికి మెరుగైన నిద్ర శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. నిద్రలేమి కారణంగా కోపం, చిరాకు వంటివి వస్తాయి. కాబట్టి విడివిడిగా పడుకుని ప్రశాంతంగా నిద్ర పోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కంఫర్ట్ నిద్రపై శ్రద్ధ
ఒకప్పుడు పెళ్లిళ్లు చేసుకున్న వారు ఎప్పుడో గొడవ జరిగితే తప్ప విడిగా నిద్రపోయేవారు కాదు. కానీ ఇప్పుడు కొత్త జంటలు పక్క వాళ్ళ అలవాట్లను, గురకను భరించలేక స్లీప్ డివోర్స్ తీసుకుంటున్నారు. ఎవరికి వారు వారిపైన, వారి కంఫర్ట్ నిద్ర పైన శ్రద్ధ పెట్టుకోవడం మంచిదని, ఈ విధానం వారి మంచి ఆరోగ్యానికి దోహదం చేస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి
-
ప్రదీప్ రంగనాథన్ 'LIK' మూవీ ఫస్ట్ రివ్యూ: హిట్టు కొట్టి కొట్టి బోర్ కొట్టట్లేదా అన్నా..!! -
నైరుతి రుతుపవనాలు షాక్. ఈ 4 నెలలు వర్షాలు కరువే? -
పేలిన బంగారం ధరల బాంబు- తారాజువ్వ -
జగన్ సెగ ఎక్కడ తాకాలో అక్కడ తాకింది.. -
IPL 2026: ముంబై ఇండియన్స్ కొంపముంచిన బుడ్డోడు! -
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
ఏం ప్లాన్ చేశావ్ భాయ్ -
బంగారం ధరల్లో బిగ్ డౌన్ ఫాల్.. !! -
IMDB అల్లు అర్జున్ టాప్-10 మూవీస్.. ‘పుష్ప2’కు దక్కని చోటు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం, ద్రోణి- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
Assembly Poll Survey: బెంగాల్, అస్సాంలో గెలుపెవరిది ? షైనింగ్ ఇండియా తాజా సర్వే..!












Click it and Unblock the Notifications