Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చలికాలంలో స్వెటర్ వేసుకుని నిద్రిస్తున్నారా? అయితే మీరు ప్రమాదంలో పడ్డట్లే!

సాధారణంగా చలికాలంలో వెచ్చగా ఉండాలని రాత్రిపూట స్వెటర్లు, సాక్సులు, టోపీలు ధరించి పడుకోవడం చాలా మందికి అలవాటుగా ఉంటుంది. చలి నుంచి రక్షణ పొందేందుకు రాత్రి నిద్రపోయేటప్పుడు స్వెటర్లు ధరించి పడుకుంటారు. ఇది మనకు సౌకర్యంగా అనిపించినప్పటికీ.. ఆరోగ్యానికి మేలు కంటే కీడే ఎక్కువ చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా చేయడం వల్ల శరీర సహజ నిద్ర చక్రంపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిద్రకు ఉష్ణోగ్రత ఆటంకం కలిగిస్తుందట..
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మన శరీరం నిద్రలోకి జారుకోవడానికి శరీర ఉష్ణోగ్రత స్వల్పంగా తగ్గాలి. మెదడుకు నిద్ర సమయం అయిందని సంకేతాలు అందాలంటే శరీరం చల్లబడటం ముఖ్యం. కానీ స్వెటర్ ధరించడం వల్ల శరీర వేడి బయటకు పోకుండా లోపలే బందీ అవుతుంది. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గదు, ఫలితంగా నిద్ర సరిగ్గా పట్టకపోవడం లేదా మధ్యమధ్యలో మెలకువ రావడం జరుగుతుంది.

Sleeping with a Sweater in Winter Doctors Warn It Can Disrupt Your Sleep

స్వెటర్ వల్ల కలిగే ప్రధాన సమస్యలు
రాత్రిపూట చెమటలు: స్వెటర్ మందంగా ఉండటం వల్ల శరీరం నుంచి వేడి విడుదల కాదు. దీనివల్ల నిద్రలో విపరీతంగా చెమటలు పడతాయి. ఆ చెమట చల్లబడినప్పుడు మరింత అసౌకర్యంగా అనిపిస్తుంది.

చర్మ సమస్యలు: సింథటిక్ ఉన్నితో తయారైన స్వెటర్లు ఎక్కువ సేపు ధరించడం వల్ల చర్మంపై దద్దుర్లు, దురద వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా బిగుతుగా ఉండే స్వెటర్లు రక్త ప్రసరణకు అడ్డుపడవచ్చు.

డీహైడ్రేషన్: నిద్రలో అధికంగా చెమట పట్టడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గుతుంది. ఉదయాన్నే నోరు ఎండిపోవడం, విపరీతమైన దాహం వేయడం వంటివి డీహైడ్రేషన్ లక్షణాలు.

వెచ్చగా ఉండటానికి ప్రత్యామ్నాయ మార్గాలు:
రాత్రిపూట చలిగా అనిపిస్తే స్వెటర్లకు బదులుగా ఈ క్రింది పద్ధతులను పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. మందపాటి బట్టలు వేసుకునే బదులు, ఒకటి లేదా రెండు మెత్తని దుప్పట్లు కప్పుకోవడం ఉత్తమం. వేడిగా అనిపిస్తే ఒక దుప్పటిని సులభంగా పక్కకు జరపవచ్చు. కాటన్ లేదా సిల్క్ వంటి గాలి ఆడే సహజ సిద్ధమైన దుస్తులను ధరించండి. నిద్రపోయే ముందు గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీటిని తాగడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల కండరాలు రిలాక్స్ అయ్యి మంచి నిద్ర పడుతుంది. గది ఉష్ణోగ్రతను మరీ చల్లగా కాకుండా, మరీ వేడిగా కాకుండా సమానంగా ఉంచుకోవడం ద్వారా ప్రశాంతమైన నిద్రను పొందవచ్చు. భారీ స్వెటర్ల కంటే తేలికపాటి వెచ్చని దుస్తులే నిద్రకు మేలు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+