Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సొరకాయ కొత్తిమీర జ్యూస్.. ఇలా చేసుకుని తాగితే .. స్పీడ్ గా వెయిట్ లాస్..

సొరకాయ ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్యులు చెబుతున్నారు. సొరకాయలో నీరు సమృద్ధిగా ఉంటుంది.. కాబట్టి సొరకాయ జ్యూస్ ను రోజూ ఖాళీ కడుపుతో తాగడం వల్ల శరీరంలో డీ-హైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది. సొరకాయ రసాన్ని ఖాళీ కడుపుతో ఒక నెల పాటు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సీ, విటమిన్ బీ, విటమిన్ కే, ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి మంచిదని వైద్యులు వివరిస్తున్నారు.

మరి వెయిట్ లాస్ కు మంచి ఔషధంగా చెప్పే సొరకాయ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి.. సొరకాయ కొత్తిమీర జ్యూస్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. సొరకాయ ముక్కలు ఒక కప్పు, నిమ్మరసం ఒక టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర టీ స్పూన్, ఉప్పు తగినంత, అల్లం తరుగు తగినంత సిద్ధం చేసుకుని పెట్టుకోవాలి. సొరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. కొత్తమీర చిన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

Slim Down Sip Easy Zucchini Coriander Juice Recipe for Rapid Weight Loss

ఇక ముందుగా ఓ మిక్సీ జార్ తీసుకోవాలి. అందులో సొరకాయ ముక్కలు, సొరకాయ పొట్టు, జీలకర్ర, అల్లం ముక్కలు, జీలకర్ర పొడి, కొత్తిమీర, ఉప్పు, నిమ్మరసం వేసుకోవాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసుకోవాలి. వాటిని మిక్సీ పట్టి ఒక గ్లాసులో పోసుకోవాలి. అంతే ఐదు నిమిషాల్లోనే సొరకాయ కొత్తిమీర జ్యూస్ రెడీ అవుతుంది. ఒక నెల రోజులపాటు ఈ జ్యూస్ ను రోజూ తీసుకోవడం ద్వారా స్పీడుగా వెయిట్ లాస్ అవుతారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+