సూపర్ టేస్టీ సొరకాయ- టమాటా చట్నీ.. ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
టమాటా చట్నీ చాలా టేస్టీగా ఉంటుంది. రోటి పచ్చడి అయినా.. మిక్సీలో పట్టినా టమాటా చట్నీ రుచి అద్భుతంగా ఉంటుంది. ఇక సొరకాయ కర్రీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పచ్చిమిర్చి లేదా కారంతో చేసినా సొరకాయ కర్రీ టేస్ట్ అదుర్స్ అని చెప్పొచ్చు. మరి సొరకాయ- టమాటా చట్నీ ఎప్పుడైనా ట్రై చేశారా..? సొరకాయ- టమాటా చట్నీ కాంబో ఇలా చేస్తే మళ్లీ మళ్లీ చేసుకుని తినాలనిపిస్తుంది. మరి ఈ చట్నీ తయారి విధానం.. కావాల్సిన పదార్థాలు చూస్తే..
సూపర్ టేస్టీ సొరకాయ- టమాటా చట్నీ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. సొరకాయ ఒకటి మీడియం లేదా చిన్న సైజు, టమాటోలు నాలుగైదు, నూనె తగినంత, పొట్టు మినప్పప్పు రెండు స్పూన్ లు, పచ్చిమిర్చి పది లేదా అంతకంటే ఎక్కువ, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, ఉప్పు రుచికి సరిపడా తీసుకోవాలి.
సొరకాయ- టమాటా చట్నీ తయారీ విధానం చూస్తే.. సొరకాయను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే టమాటో ముక్కలను కూడా చిన్నగా కట్ చేసుకోవాలి. అనంతరం స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత పొట్టు మినప్పప్పు వేసి వేయించాలి. వేగిన తర్వాత ఆ మిశ్రమాన్ని మిక్సీ జార్ లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు అదే గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి కూడా ఫ్రై చేసుకున్నాక మినప్పప్పు ఉన్న మిక్సీ జార్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో మరికొంచెం నూనె వేసి సొరకాయ ముక్కలను వేసి మూతపెట్టుకోవాలి. అలా మధ్యమధ్యలో కలుపుతూ కుకింగ్ చేసుకోవాలి. సొరకాయ ముక్కలు మగ్గిన తర్వాత అందులో టమాటా ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. సొరకాయ, టమాటా ముక్కలు మంచిగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి.

ఇప్పుడు మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి, మినప్పప్పులో జీలకర్ర, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అందులో టమాటా, సొరకాయ ముక్కలను యాడ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా రోటిలో రుబ్బుకున్న విధంగా కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఆ పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకుని తాలింపు చేసుకుంటే సరి.. సూపర్ టేస్టీ సొరకాయ- టమాటా పచ్చడి రెడీ అయినట్టే..
-
"ముల్లంగి మజ్జిగ పులుసు" ఇలా చేస్తే యమా టేస్టు.. -
సమ్మర్ స్పెషల్.. అటుకులతో పాయసం.. ఇలా చేస్తే టేస్ట్ సూపర్.. -
సమ్మర్ లో చలువ చేసే 'సొరకాయ మజ్జిగ పులుసు'.. క్షణాల్లో ఇలా చేసుకోండి..! -
"గోంగూర పప్పు" ఇలా ట్రై చేస్తే ప్లేట్ ఖాళీనే.. -
వేసవిలో ఏ కల్లు తాగడం బెస్ట్ ? తాటి కల్లు ?? ఈత కల్లు ??? -
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
టీవీకే అభ్యర్థుల జాబితా విడుదల వేళ.. త్రిష ప్రీ- ప్లాన్డ్ గా !! -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
తెలుగు ఇండస్ట్రీ హిట్ హిందీ రీమేక్‌లో శ్రీలీల.. ట్రోలింగ్ చూస్తే ఏడుపే !! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!!












Click it and Unblock the Notifications