జొన్న పిండితో అద్దిరిపోయే సూప్.. ఈజీగా ఇలా చేసుకోండి..!

జొన్నలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే జొన్నపిండితో టేస్టీ సూప్ ఎప్పుడైనా తయారు చేశారా..? టేస్ట్ తో పాటు ఈజీగా ఈ సూప్ ను తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ లో రకరకాల కూరగాయలు కూడా వేయొచ్చు. ఇక ఈ సూప్ ను పెద్దలతోపాటు పిల్లలు కూడా ఇష్టంగా తాగుతుంటారు. మరి ఈ టేస్టీ సూప్ తయారీ విధానం ఏంటి..? కావాల్సిన పదార్థాలు చూస్తే..

జొన్న పిండితో అద్దిరిపోయే సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. ఉల్లిపాయలు, నూనె, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, క్యారెట్, టమాటా, కరివేపాకు, జొన్నపిండి ,మిరియాల పొడి, ఉప్పు, కొత్తిమీర తరుగు, నిమ్మరసం తీసుకోవాలి.

తయారీ విధానం చూస్తే.. ఈ సూప్​ కోసం ముందుగా ఉల్లిపాయ, టమాటాను సన్నగా కట్​ చేసుకోవాలి. క్యారెట్ ను తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్​ ఆన్​ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో​ నూనె పోసి వేడి చేసుకోవాలి. ఇప్పుడు నూనెలో జీలకర్ర వేయాలి. అవి ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్​ వేసి పచ్చి వాసన పోయేవరకు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఆ తర్వాత ఉల్లిపాయ, క్యారెట్​ తరుగు, టమాటా ముక్కలు, కరివేపాకు వేసి కలపాలి. అవి వేగిన తర్వాత అందులో నీళ్లు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరిగించుకోవాలి.

SorghumFlour Soup Spicy tasty recipe Easy Jonna Pindi Charu Recipe Tangy amp amp Healthy in Minutes

ఇప్పుడు మరో గిన్నెలోకి జొన్న పిండి తీసుకోవాలి. తగినన్ని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జొన్న పిండిని యాడ్​ చేసుకుని కలిపి లో టూ మీడియం మంట మీద 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అందులో కొత్తిమీర తరుగు, నిమ్మరసం వేస్తే సరి.. సూపర్ టేస్టీ జొన్న సూప్​ రెడీ అయినట్టే..

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+