బెండకాయ ఫ్రై.. ఇలా చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది..!
బెండకాయ కర్రీని ఎలా చేసుకున్నా టేస్టీగానే ఉంటుంది. కొంతమంది పులుసు పెట్టుకుంటారు. మరి కొంత మంది కర్రీ చేసుకుంటారు. ఇంకొంత మంది ఫ్రై చేసుకుంటారు. అయితే జిగురు లేకుండా సూపర్ టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై ను ఎలా తయారు చేసుకోవాలి..? బెండకాయ ఫ్రై చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటి..?
సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు చూస్తే.. బెండకాయలు 750 గ్రాములు, నూనె తగినంత, పచ్చిమిర్చి పది, శనగపప్పు ఒక టీ స్పూన్, ఆవాలు ఒక టీ స్పూన్, జీలకర్ర ఒక టీ స్పూన్, కారం తగినంత, పసుపు అర టీస్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉప్పు రుచికి సరిపడా, కొత్తిమీర తరుగు కొద్దిగా తీసుకోవాలి.
బెండకాయ ఫ్రై తయారీ విధానం చూస్తే.. ముందుగా బెండకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ ముక్కలను ఓ ప్లేట్ లోకి తీసుకుని ఆరబెట్టాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకోవాలి. అందులో తగినంత నూనె పోసి వేడి చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.

ఆ మిశ్రమంలో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు జతచేసి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసి బాగా కలపాలి. అలా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని 10 నిమిషాలపాటు వేయించుకోవాలి. జిగురు లేకుండా బెండకాయ ముక్కలు బాగా ఫ్రై చేసుకున్నాక అందులో తగినంత పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులోనే కొత్తిమీర తరుగు వేసి బాగా కలపాలి. ఉల్లి, వెల్లుల్లి వేయకుండానే సూపర్ టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ అయినట్టే..












Click it and Unblock the Notifications