Dental health: ఆ దంత సమస్యకు 'స్ట్రా'తో చెక్.. పళ్లను అవి ఎలా కాపాడతాయంటే..
Health News: కూల్ డ్రింక్స్ సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా చాలామంది చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటారు. కంటికి కనిపించని అవయవాలకు మాత్రమే ఇవి హాని కలిగిస్తాయని భావించడం సరికాదు. జీవితకాలంలో టన్నుల కొద్దీ ఆహారాన్ని నమలడంలో మనకు ఎంతగానో సహకరించే దంతాలకు తీరని నష్టం ఏర్పరుస్తాయని చాలా మందికి తెలియదు.
'ఫ్యాబ్యులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్' ద్వారా ప్రసిద్ధి చెందిన ఆర్ట్ కలెక్టర్ శాలిని పస్సీ ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్టు వైరల్‌గా మారింది. తాను ఇష్టపడే పానీయాలను ఆస్వాదిస్తూనే దంతాలను రక్షించుకోవడానికి వినూత్న పద్ధతిని అవలంభిస్తున్నట్లు చెప్పి యూజర్లలో ఆసక్తిని రేకెత్తించారు. షాంపెయిన్‌ను స్ట్రా ద్వారా తాగడం వల్ల తన సహజమైన దంతాలను సురక్షితంగా ఉంచుకుంటున్నట్లు తెలిపారు.

తన స్నేహితులలో చాలామంది ఎనామెల్ రక్షణ కోసం దంతాలపై అమర్చే ప్రత్యేక కవచాలు 'వీనీర్స్' ను కూడా ఉపయోగిస్తున్నట్లు శాలిని చెప్పుకొచ్చారు. ఎక్కువ కాలం ఆమ్లపానీయాలను తీసుకోవడం వల్ల దంతాల ఎనామెల్ పోయే ప్రమాదం ఉందని, అందుకే వీనీర్స్ అమర్చుతారని వివరించారు. తాను మాత్రం స్ట్రా వినియోగానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు వెల్లడించారు.
ఆమ్లపానీయాలైన సోడా లేదా షాంపెయిన్ వంటి పానీయాలు సేవించేటప్పుడు స్ట్రా వాడటం వలన ఎనామెల్ నష్టాన్ని తగ్గించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. 'ఈ పానీయాలు అధిక ఆమ్లత మరియు తక్కువ pH స్థాయిని కలిగి ఉంటాయి. దీర్ఘకాలంలో ఇవి ఎనామెల్ దెబ్బతీస్తాయి' అని డాక్టర్ బిభాకర్ రంజన్ అనే దంత నిపుణులు తెలిపారు. స్ట్రాని ముందు దంతాలతో టచ్ చేయడం వలన ఎనామెల్‌కు హానితో పాటు క్యావిటీ రిస్క్ కూడా తగ్గుతుందని సూచించారు.
కేవలం ఎనామెల్ రక్షణకు మాత్రమే కాకుండా స్ట్రా ద్వారా తాగడం వల్ల ముందు భాగంలోని దంతాల రంగు మారడం కూడా తగ్గుతుందని రంజన్ తెలిపారు. మెరిసే నవ్వుకు ఇది ఎంతగానో సహకరిస్తుందన్నారు. ఇలా డ్రింక్స్ తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయని ఇతర డాక్టర్లు కూడా సిఫారసు చేస్తున్నారు. కొంతలో కొంత దంతాల సంరక్షణకు ఇదొక సరళమైన మరియు సమర్థవంతమైన మార్గంంగా చెబుతున్నారు.












Click it and Unblock the Notifications