తెలంగాణ స్టైల్ 'బోటీ ఫ్రై'.. టేస్టులో దీన్ని కొట్టేదే లేదు..!
నాన్ వెజ్ అంటే ఇష్టపడని వారుండరు. అది కూడా బోటీ అంటే ఎంతోమందికి నోరూరుతుంది. తెలంగాణ స్టైల్ లో 'బోటీ ఫ్రై' చేస్తే ఇక లొట్టలేసుకుంటూ తినాల్సిందే.. బోటీని ఫ్రైగా ఇగురు, పులుసు గా పెట్టుకుంటారు. బోటీ తయారీ కంటే వాటిని శుభ్రం చేయడమే కష్టం. బోటీని నీచు వాసన లేకుండా క్లీన్ చేసి ఫ్రై చేస్తే టేస్టు అదిరిపోతుంది. మరి తెలంగాణ స్టైల్ లో బోటీ ఫ్రై ఎలా చేయాలి..?
ముందుగా బోటీని(500 గ్రాములు) తెచ్చుకున్నాక శుభ్రంగా కడిగి ప్రెషర్ కుక్కర్లో వేయాలి. దాంట్లో కొద్దిగా పసుపు, బోటీ మునిగేంతవరకు నీళ్లు పోసి కలిపి మూత పెట్టి స్టవ్ మీద పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నీటిని వడకట్టాలి. ఆ తర్వాత మరోసారి బోటీని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, అల్లం పేస్టు తగినంత, కారు రెండు టేబుల్ స్పూన్ లు, టమాట ఒకటి, ధనియాల పొడి 1 స్పూన్, ఉప్పు, పసుపు సరిపడా , నూనె 4 టేబుల్ స్పూన్ లు, పూదీనా, కొత్తిమీర గుప్పెడు.. తీసుకోవాలి.

ఇక స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి నూనె పోసి వేడి చేసుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు వేసి బాగా కలుపుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే కలుపుకోవాలి. పచ్చి వాసన పోయేంత వరకూ వేయించుకోవాలి. ఆ తర్వాత ఆ మిశ్రమంలో ఉడికించిన బోటీ వేసి ఫ్రై చేసుకోవాలి. బోటీ బాగా వేగాక అందులో ధనియాల పొడి, కారం, గరం మసాలా వేసుకోవాలి. బాగా కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. మసాలాలు మొత్తం బోటీ ముక్కలకు పట్టేంత వరకూ వేయించి చివరిలో కొత్తిమీర తురుము, నిమ్మరసం పిండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.












Click it and Unblock the Notifications