Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

అధిక కొలస్ట్రాల్‌లను సహజంగా తగ్గించే ఆయుర్వేద మూలికలు.. ఒక్కసారి వాడితే చాలు!

కొలెస్ట్రాల్ సమస్య ప్రస్తుతం చాలా మందిని వేధిస్తున్న సమస్య. ఆధునిక జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువ అయ్యేకొద్ది హృద్రోగాలు, రక్తనాళ సమస్యలు వంటి ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. అయితే, కొలెస్ట్రాల్ నియంత్రణకు పాశ్చాత్య ఔషధాలను మాత్రమే కాదు, ఆయుర్వేదంలో అందుబాటులో ఉన్న ప్రకృతి మూలికలను కూడా ఉపయోగించవచ్చు. ఇవి సహజంగా శరీరానికి హానికరం కాకుండా ఉపయోగపడతాయి. కొలెస్ట్రాల్ సమస్యను నివారించడానికి ,తగ్గించడానికి ఆయుర్వేదం అనేక మూలికలను సూచిస్తారు. ఈ మూలికలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో మాత్రమే కాకుండా మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

1. అర్జున: (Arjuna Bark)
అర్జున శక్తివంతమైన ఆయుర్వేద మూలిక. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కూడా ఇది సహాయపడుతుంది.ఈ మూలిక రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడుతుంది. అరట పొడి ను నీటిలో కలిపి త్రాగడం లేదా అరటతో చేసిన చూర్ణాన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ఉపయోగకరం.

These are the Ayurvedic herbs that naturally lower high cholesterol

2. గుగ్గిలం ( Guggilam)
గుగ్గిలం పూజలో దూపం వేయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. గుగ్గులు ( గుగ్గిలం) అనేది ప్రాచీన ఆయుర్వేద ఔషధం, ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. ఇందులో గుగ్గులస్టెరాన్ అనే రసాయనాలు ఉండి రక్త నాళాలలో కొవ్వు పేరుకుపోవడం తగ్గిస్తాయి. గుగ్గులతో చేసిన క్యాప్సూల్స్ లేదా చూర్ణం తీసుకోవచ్చు.

3. మెంతులు (Fenugreek Seeds)
మెంతులలో ఫైబర్ అధికంగా ఉండటం వల్ల ఇది రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ స్థాయులను తగ్గించడంలో సహాయపడుతుంది. మెంతులను రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయం త్రాగడం లేదా మెంతి పొడి తీసుకోవడం మంచి పరిష్కారం.

4. తులసి (Holy Basil)
తులసి ఆకులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, గుండెకు మంచి ఆరోగ్యం కలిగిస్తాయి. తులసి ఆకులను ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినడం లేదా తులసి టీ తాగడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు.

5. హరితకీ (Haritaki)
హరితకీ ( కరక్కాయ ) శరీరంలోని టాక్సిన్లను తొలగించి, కొలెస్ట్రాల్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుంది. హరితకీ చూర్ణం నీటిలో కలిపి తీసుకోవడం లేదా హరితకితో చేసే ఆయుర్వేద ఔషధాలు ఉపయోగించవచ్చు.

6. వెల్లుల్లి (Garlic)
వెల్లుల్లిలో ఉన్న అలిసిన్ రసాయనం రక్తనాళాల ఆహారాన్ని మెరుగుపరచడంలో, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రోజూ 1-2 వెల్లుల్లి రెబ్బలను తినడం లేదా నీటిని త్రాగడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

7. త్రిఫల చూర్ణం (Triphala)
ఇది హరితకీ, బిభీతకీ, అమలకీ అనే మూడు మూలికల మిశ్రమం. ఇది రక్తంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గించడంలో అద్భుతమైన పరిష్కారం. ట్రిఫలాను రోజూ ఆహారంలో చేర్చుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

సహజ మార్గంలో కొలెస్ట్రాల్ తగ్గించడానికి చిట్కాలు
ఈ ఆయుర్వేద మూలికలతో పాటు సమతుల ఆహారం తీసుకోవాలి. రోజూ వ్యాయామం చేయడం ముఖ్యం. ఫ్రైడ్ , ప్రాసెస్‌డ్ ఫుడ్స్‌కు దూరంగా ఉండండి. నీటిని ఎక్కువగా త్రాగడం, స్ట్రెస్‌ నియంత్రణ చేసుకోవడం శరీరానికి ఆరోగ్యకరం.

గమనిక: ఆయుర్వేద మూలికలు ఉపయోగించడానికి ముందు ఆయుర్వేద వైద్యుల సలహా తీసుకోవడం ఉత్తమం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+