దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉండాలంటే మీరు చెయ్యాల్సిందిదే!!

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ప్రస్తుతం ఎక్కువమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించాలంటే మనం ప్రతిరోజు ఫాలో చేయాల్సిన కొన్ని టిప్స్ తూచా తప్పకుండా ఫాలో చేస్తే సరిపోతుంది. అవేమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. ఆరోగ్యంగా ఉంటేనే జీవితంలో ఏదైనా సాధించగలుగుతాం. అందుకే రోజూ కొన్ని టిప్స్ ఫాలో చేస్తే ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించగలుగుతాం.

ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా చెయ్యండి
ఇక ఆ టిప్స్ లోకి వస్తే ప్రతిరోజు వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అంతేకాదు ప్రతిరోజు మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఏ ఆహారం ఆరోగ్యాన్ని ఇస్తుంది.. ఏ ఆహారం అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనే విషయం తెలుసుకొని తదనుగుణంగా ఆరోగ్యాన్ని ఇచ్చే పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ తో ప్రారంభించాలి.

This is what you need to do to stay healthy for a long time

బ్రేక్ ఫాస్ట్, లంచ్ ఇలా ప్లాన్ చెయ్యండి
ఓట్స్, పండ్లు, డ్రై ఫ్రూట్స్ వంటి వాటిని బ్రేక్ ఫాస్ట్ లో భాగం చేసుకోవాలి. ఇక మధ్యాహ్న భోజనంలో ఆకుకూరలు, కూరగాయలతో పాటు పోషకాలు పుష్కలంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ముఖ్యంగా మనం తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్ తక్కువగాను ప్రోటీన్ ఎక్కువగానూ ఉండే విధంగా చూసుకోవాలి.

ఒత్తిడి తగ్గించుకోండి
ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఒత్తిడి కారణంగా మనం మనకు తెలియకుండానే అనేక అనారోగ్యాల బారిన పడుతున్నాం. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా వంటి వాటిని సాధన చేయాలి. ఎప్పుడు మైండ్ క్లియర్ గా ఉంచుకోవాలి. ఇక ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు శరీరాన్ని డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం శరీరానికి చాలా అవసరం.

హైడ్రేటెడ్ గా ఉండండి
షుగర్ అధికంగా ఉండే కూల్ డ్రింక్స్ తాగకుండా ఉండాలి. మన శరీరానికి తగినంత మంచినీటిని తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవాలి. ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు చేయవలసిన ముఖ్యమైన పని సరిగా నిద్రపోవడం. ప్రతిరోజు ఏడు నుండి ఎనిమిది గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.

నిద్ర చాలా అవసరం
ఏం చేసినా చేయకపోయినా సరేనా నిద్ర మాత్రం శరీరానికి చాలా అవసరం. నిద్ర మన శరీరంలో ఉన్న అనేక సమస్యలను పరిష్కరిస్తుంది. ఓ రకంగా చెప్పాలంటే నిద్ర మన శరీరాన్ని రిపేర్ చేస్తుంది. కాబట్టి శరీరానికి తగినంత నిద్రపోవాలి. ఎవరైతే ఈ రూల్స్ తూచా తప్పకుండా ఫాలో చేస్తారో వారు ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+